For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమృతం తాగిన అనుభూతి- మ్యాంగో లస్సీ..!

|

వేసవిలో దాహం తీర్చుకునేందుకు ఎక్కువమంది లస్సీని ఎంచుకుంటారు. లస్సీ నిజానికి పంజాబీ సంప్రదాయ పానీయం. పెరుగుతో తయారుచేసే ఈ సమ్మర్ డ్రింక్ మన దేశంలోనే కాదు పాకిస్తాన్‌లోనూ చాలా ఫేమస్. కారాన్ని ఇష్టపడేవాళ్లు పెరుగులో ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి తయారుచేస్తే తీపిని ఇష్టపడేవాళ్లు పంచదార వేసుకుంటారు.

ఈ రెండూ కాకుండా నచ్చిన పండ్లతో కూడా లస్సీ చేసుకోవచ్చు. దేనితో కలిపినా చక్కగా కలిసిపోయి నోటికి కమ్మదనాన్ని, ఒంటికి చల్లదనాన్ని ఇచ్చేవి పండ్లతో తయారు చేసే లస్సీలు. అయితే ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కాబట్టి మ్యాంగో లస్సీ ఎలా తయారు చేస్తారు ఒక సారి చూద్దాం...

Mango Lassi
కావలసిన పదార్థాలు:
ఒక మామిడి పండ్లు : 1 లేదా 2(గుజ్జు తీసుకోవాలి)
పంచదార: 1/2cup
పెరుగు: : 1cup
ఐస్‌క్యూబ్స్: 2-3
యాలకుల పొడి: చిటికెడు
కుంకుమపువ్వు: చిటికెడు

తయారు చేయు విధానం:
1. ముందుగా మామిడిపండుకు ఉన్న పైపొట్టును తీసి గుజ్జుగా తయారు చేసుకోవాలి.
2. తర్వాత పెరుగు, పంచదార, యాలకుల పొడి, ఐస్‌క్యూబ్స్‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెడ్ చేయాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకుని కుంకుమపువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చల్లటి మ్యాంగో లస్సీ తాగుతుంటే అమృతం తాగినట్టే ఉంటుంది.

English summary

Mango Lassi: A Soothing Drink | అమృతం తాగిన అనుభూతి- మ్యాంగో లస్సీ..!

Lassi is a traditional Indian drink that is made with yogurt. This soothing drink is healthy and filling too! As mangoes are the fruit of the season, use the King of all fruits to make yummy lassi. Make it a special dish by adding little whipped cream or yogurt and mint leaves as toppings.
Story first published: Monday, May 6, 2013, 16:59 [IST]
Desktop Bottom Promotion