For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చల్ల చల్లని..తియ్య తియ్యని..మ్యాంగో రసగుల్లా

|

ప్రస్తుతం మ్యాంగో సీజన్ కాబట్టి..చాలా వరకూ అందరికీ మామిడి పండ్లంటే ఇష్టం కాబట్టి మామిడి పండ్ల సీజన్ మొత్తం ఏదో ఒక వెరైటీని తయారు చేసి టేస్ట్ చేయడం అంటే మహా ఇష్టం. మరి మన రాష్ట్ర వంటలే కాకుండా మామిడితో పక్క రాష్ట్రాల వారు తయారు చేసే వెరైటీ రుచులకు కూడా మనం రుచి చూస్తే ఎంత బాగుంటుంది.

మ్యాంగో రసగుల్లా పంజాబీ స్వీట్స్ లో బాగా పాపులర్ అయిన వంటకం. రసగుల్లా రకరకాలుగా వండుతారు. మామిడి పండ్లు ఉపయోగించి చేసే రసగుల్లా చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ తో నోరూరిస్తుంటుంది. ఇందులో వేసే మ్యాంగో ఎసెన్స్ మరింత సువాసనను అందిస్తుంది. రుచికూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మరి మ్యాంగో రసగుల్లా ఎలా తయారుచేయాలో చూద్దాం...

Mango Rasgulla

కావల్సిన పదార్థాలు:
కాటేజ్ చీజ్ : 2 కప్
మైదా: 1cup
పంచదార: 1cup
పాలు: ½cup
మామిడి గుజ్జు: 1cup
మ్యాంగో ఎసెన్స్: ½tsp
ఏలకుల పొడి: ½tsp
పిస్తాలు: 7-8 (చిన్న ముక్కలుగా తరిగినవి)

తయారు చేయు విధానం:
1. ముందుగా కాటేజ్ చీజ్ మరియు మామిడి గుజ్జు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకొన్న తర్వాత ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఒక కప్పు నీళ్ళు ఒక గిన్నెలో పోసి అందులో పంచదార మరియు యాలకుల పొడి వేసి, తక్కువ మంట మీద ఎక్కువ సేపు బాగా మరగ కాచాలి. పంచదార కరిగిపోయి తీగపాకంలా తయారయ్యే వరకూ కాచాలి.

3. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె లేదా పాన్ తీసుకొని అందులో సిరప్ పోసి తర్వాత సన్నని స్పూన్ తో మ్యాంగో బాల్స్ ఒక్కొక్కటే తీసి సిరప్ లో వేయాలి. తక్కువ మంట మీద రెండు మూడు నిముషాలు ఉంచాలి

4. స్పూన్ తో రసగుల్లాను సిరప్ లో పూర్తిగా మునిగేలా చేసి తక్కువ మంట మీద 10 నిముషాల పాటు మూత పెట్టి ఉడికించాలి.

5. మద్యలో చెక్ చేస్తూ బాల్స్ సైజ్ పెరిగిందో లేదా మరియు మెత్తగా అయినాదో లేదో పరిశీలించాలి. ఇలా పెద్ద మరియు మెత్తగా తయారైన రసగులా చూసి స్టౌ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి.

6. ఒకసారి చల్లారిన తర్వాత పిస్తాపలుకులను గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.

English summary

Mango Rasgulla-Summer Special | చల్ల చల్లని..తియ్య తియ్యని..మ్యాంగో రసగుల్లా

Rasgulla is one of the most popular sweet dishes from West Bengal. It is so famous that whenever you hear the name rasgulla, you are just forced to think of Bengal.
Story first published: Tuesday, May 7, 2013, 16:38 [IST]
Desktop Bottom Promotion