For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉగాది స్పెషల్ మినప గారెలు

|

Minapa Garelu is a Traditional Recipe
గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. మరి ఈ వంటకాన్ని ఉగాది స్పెషల్ గా చేసుకుంటే

కావలసిన పదార్ధాలు :
మినప పప్పు : 1/2kg
పచ్చిమిర్చి: 2
అల్లం: కొద్దిగా
మిరియాలు: 1tsp
ఉల్లిపాయలు: 4-5
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: వేయించడానికి సరిపడా
వంటసోడ : చిటికెడు

తయారు చేయు విధానం :

1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.
2. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, మిరియాలపొడి, ఉప్పు మూడింటిని కొద్దిగా రుబ్బి, అలా వచ్చిన మిశ్రమాన్ని రుబ్బిన పప్పులో కలపాలి.
3. తర్వాత స్టౌ వేలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, కాగనివ్వాలి.
4. ఇప్పుడు పిండిలో వంటసోడా కలిపి, కొద్దికొద్దిగా పిండిని తడిచేసిన కాగితంపై గారెల రూపంలో వత్తి, కాగిన నూనెలో వెయ్యాలి. బాగా వేగాక ప్లేటులోకి తీసి చెట్నీతో తినటమే. అంతే మినపగారెలు రెడీ

English summary

Minapa Garelu is a Traditional Recipe | ఉగాది స్పెషల్ మినప గారెలు


 Minapa Garelu,The traditional food of Andhra is mainly prepared during the festival times be it Ugadi,Pongal,Diwali…..list goes on.These Garelu are very crispy and is served with sambar ,coconut chutney. Garelu are prepared with whole black gram lentil batter. We add chopped onions and green chillis to the batter, and so these are called as Ulli Garellu.
Story first published:Thursday, March 22, 2012, 17:50 [IST]
Desktop Bottom Promotion