For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిర్చి కి పకోడ రిసిపి: స్పైసీ స్నాక్ రిసిపి

|

స్పైసీ మిర్చీ బజ్జీ ఇండియన్ హాట్ స్నాక్. ఈవినింగ్ స్నాక్స్ లో అతి త్వరగా, సులభంగా తయారు చేసుకొనేది ఈ మిర్చీబజ్జీయే .వర్షాకాలంలో సన్నని వర్షపు జల్లుల మధ్య వేడి వేడి మిర్చీ బజ్జీ భలే రుచిగా ఉంటుంది. మిర్చీ బజ్జీ అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చలికాలంలో వీటికి ఫ్యాన్స్ ఎక్కువే అని చెప్పవచ్చు.

అయితే కొంత మంది మాత్రం పచ్చిమర్చిని తినడానికి బయపడుతుంటారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి, మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, వీటి విలువలు తెలిసిన వారు నిరభ్యంతరంగా తనడానికి ఏ మాత్రం వెనుకాడు . పకోడ అంటే ఫ్రైడ్ స్కాన్. ఈ ఫ్రైడ్ స్నాక్ రిసిపిని వివిధ రకాల పదార్థాలు జోడించి వండుతుంటారు. చాలా వరకూ చలికాలంలో ఉల్లిపాయ పకోర, గోబి పకోర, ఆలూ పకోరాలు తయారుచేయడం చూసుంటారు మరియు ఇవి చాలా పాపులర్ స్నాక్ రిసిపిలు అలాగే ఈ మిర్చి పకోరాను కూడా ఈ చలికాలంలో ట్రైచేసి టేస్ట్ ను ఎంజాయ్ చేయండి.....

Mirch Ke Pakode: Spicy Snack Recipe

కావల్సిన పదార్థాలు:
పెద్ద పచ్చిమిర్చి(బజ్జీ మిర్చి): 10
శెనగపిండి: 1cup
కారం: 1tsp
ఛాట్ మసాలా: 3tsp
అజ్వైన్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: కొద్దిగా
నూనె : డీఫ్రైకి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, పసుపు, కారం, ఉప్పు, అజ్వైన్ మరియు ఛాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని కొద్దిగా చిక్కగా జారుడుగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు బజ్జీ మిర్చినీ శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తో తుడిచి పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక్కోదాన్ని తీసుకొని మిర్చి పొడవునా చీలిక చేసి లోపలి విత్తనాలను తొలగించాలి .
5. ఇలా మొత్తం రెడీ చేసుకొన్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిలో మిర్చిలను డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. కాగిన తర్వాత అందులో శెనగపిండిలో వేసిన మిర్చిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
7. అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. అంతే మిర్చి పకోర రెడీ. వీటిని మీకు నచ్చిన కెచప్ లేదా చట్నీతో సర్వ్ చేయాలి.

English summary

Mirch Ke Pakode: Spicy Snack Recipe

All you need during the monsoons is a cup of hot tea and a plate of crispy pakoras to relish. This season brings in the mood to try several fried dishes. Many of us love to have pakoras and spicy chaats in this season. Pakoras are basically fried snacks.
Story first published: Thursday, November 27, 2014, 18:05 [IST]
Desktop Bottom Promotion