For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త బంగాళదుంపలతో పకోడా-సూపర్ టేస్ట్

|

చలికాలం కొంచెం కొంచెం తగ్గుతూ వసంత కాలంలోకి మారుతోంది. ఈ వసంత కాలంలో సీజనల్ వెజిటేబుల్స్ మరియు సీజనల్ ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ సీజన్ లో కొత్త బంగాళదుంపలతో మార్కెట్ మొత్తం నిండి ఉంటుంది. కొత్తబంగాళదుంపలు ఈ సీజన్ లో ఒక పండుగ వంటిది. ఇచి తాజాగా కొత్తగా, మరియు పచ్చిగా ఉంటాయి.

ఇండియన్ కుషన్స్ లో కొత్త బంగాళదుంపలతో తయారుచేసే వంటలు అనేకం ఉన్నాయి. మీరు సైడ్ డిష్ గా తయారుచేయవచ్చు లేదా స్నాక్స్ గా తయారుచేసుకోవాలి. ఈ కొత్త బంగాళదుంపలతో తయారుచేసే వంటల యొక్క రుచి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ సీజన్ లో మీరు కూడా కొత్త బంగాళదుంపను టేస్ట్ చూడాలంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్నాక్ రిసిపి తయారుచేయడం జరిగింది. మీరు కూడా ఒక సారి ట్రై చేయండి.

New Potatoes Pakora Recipe

కావల్సిన పదార్థాలు:
కొత్త బంగాళదుంపలు: 4-5
బీన్స్: 1cup
అజ్వైన్: 1tsp
కారం: 1tsp
నల్ల నువ్వులు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : వేయించడానికి సరిపడా
నీళ్ళు: 1/2cup
మెంతి ఆకులు: 1tsp

తయారుచేయు విధానం:
1. ఈ వింటర్ సీజన్ లో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బంగాళదుంపలను నీళ్ళలో వేసి బాగా శుభ్రం చేయాలి. వాటికి పొట్టు తొలగించకుండానే, కావల్సిన సైజ్ లో కట్ చేసుకొని నీటిలో నానబెట్టుకోవాలి.
2. అంతలోపు, కొంచెం పల్చాటి పిండిమిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. అందుకోసం కొంత శెనగపిండిలో సరిపడా నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు అందులో అజ్వైన్, కారం, బ్లాక్ నువ్వులు, ఉప్పు, మెంతి ఆకులు చిన్నగా తరిగి వేసి అన్నింటిని బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్లో సరిపడా నూనె పోసి, నూనె కాగిన తర్వత అందులో ముందుగా స్లైస్ గా కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు శెనగపిండి మిశ్రంలో డిప్ చేసి, కాగే నూనెలో మెళ్ళిగా వదలాలి.
5. ఇప్పుడు మంటను మీడియంగా పెట్టి, పకోరా గోల్డ్ బ్రౌన్ కలర్ కు మారే వరకూ క్రిస్పీగా వేయించుకోవాలి.
6. మిగిలిన బంగాదుంపల స్లైస్ ను కూడా ఇదే విధంగా డిప్ చేసి, కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి .
అంతే కొత్తబంగాళదుంపలతో పకోడా మెంతి కాంబినేషన్ లో తినడానికి రెడీ. ఈ పకోడా ఈవెనింగ్ స్నాక్ రిసిపిగా చాలా టేస్ట్ గా ఉంటుంది. మరియు ఇది బంగాళదుంప మరియు మెంతి ఆకుల ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది. ఈ కొత్త బంగాళదుంపల పకోడాకు టామటో సాస్ లేదా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయండి.

English summary

New Potatoes Pakora Recipe


 Arrival of spring welcomes new seasonal vegetables and fruits. For example, new potatoes are very much in the season and the market is flooded with the fresh and tasty new potatoes. New potatoes are the fresh harvest of the season which are raw and extremely new.
Story first published: Saturday, January 18, 2014, 16:11 [IST]
Desktop Bottom Promotion