For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిపాయ పకోడీ: స్పెషల్ ఈవెనింగ్ స్నాక్

|

వేడి వేడి ఉల్లిపాయ పకోడ చాలా పాపులర్ స్నాక్ రిసిపి. దీన్ని 5-10నిముషాల్లో తయారుచేయవచ్చు. మరియు ఇది పాపులర్ టీటైమ్ స్నాక్ కూడా. ఇది గ్రీన్ చట్నీ లేదా టమోటో కెచప్ తో చాలా గ్రేట్ స్నాక్. ఇది చాలా సింపుల్ మరియు ఈజీ ఆనియన్ పకోడా. చాలా తక్కువ సమయంలో దీన్ని తయారుచేయవచ్చు.
ఈ సింపుల్ స్నాక్ రిసిపిని శెనగపిండితో తయారుచేస్తారు. ఇందులో ఫ్రెష్ గా ఉండే ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా వంటివి మంచి ఫ్లేవర్ ను అందిస్తాయి. అంతే కాదు, రుచికూడా అద్భుతంగా ఉంటుంది. ఈ స్నాక్ ను గ్రీన్ చట్నీ లేదా టమోటో కెచప్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Onion Pakoda : Special Evening Snack
కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు : 3 (పెద్దవి)
పచ్చిమిర్చి : 6(సన్నగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు : ఒక కట్ట
పల్లీల పొడి : 4tsp(పల్లీలను వేయించి మెత్తగా పొడిచేసుకోవాలి)
ధనియాలపొడి : 1tsp
జీలకర్రపొడి : 1tsp
గరంమసాలా పొడి : 1/2tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1tsp
శనగపిండి : 2cups
బియ్యప్పిండి : 2tsp
ఉప్పు : రుచికి తగినంత
కారం : తగినంత
కొత్తిమీర : చిన్న కట్ట
పుదీనా : కొన్ని ఆకులు(సుమారు పదిహేను ఆకులు)
నూనె : డీప్ ఫ్రైకి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయలను ఒలిచి సన్నగా పొడవుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పచ్చిమిర్చిని పొడవుగా చీలికలు చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పుదీనా ఆకులు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పల్లీలపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి.
4. తర్వాత పాన్ లో తగినంత నూనె పోసి కాగిన తరవాత ఆ నూనెలో పకోడీలు వేసి గోధుమరంగు వచ్చాక తీసేయాలి. అంతే వేడి వేడి ఉల్లిపకడా రెడీ. వీటిని సాస్‌తో తింటే బావుంటాయి.

English summary

Onion Pakoda : Special Evening Snack


 Garam Garam Onion Pakora is an all-time favorite starter snack in most Indian party menu. It is also known as “Kanda Bhajia” in North India. This can be prepared in very less time & makes a mouthwatering combo with hot coffee
Story first published: Tuesday, March 18, 2014, 17:57 [IST]
Desktop Bottom Promotion