For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ బజ్జీ స్పెషల్ ఐటమ్

|

పన్నీర్ ను బహుముఖ జున్నుగా చెప్పవచ్చు. ఇది చాలా సులభంగా రుచికరమైన చిరుతిండ్లను మరియు తీపివంటకాల రూపంలో మిళితం. పన్నీర్ తో తయారు చేసే వంటలు ఈవెనింగ్ స్నాక్స్ గా అద్బుతంగా నప్పుతాయి. ఇవి పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా ఎక్కువగా ఇష్టంగా తింటారు.

పన్నీర్ బజ్జీ తినడానికి చాలా వెరైటీగా ఉంటుంది. పన్నీర్ లో స్పైసీలను స్టఫ్ చేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. ఈవెనింగ్ స్నాక్స్ లో ఇది ఒక అద్భుతమైన ఐటమ్ గా చెప్పవచ్చు. రుచి మాత్రమే కాదు , హెల్తీ పన్నీర్ వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. మిర ఈ సింపుల్ మరియు ఈజీ హెల్తీ స్నాక్ ను తిని ఎంజాయ్ చేయండి..

Panner Bajji

కావలసిన పదార్థాలు:
శనగపిండి : 1cup
బియ్యప్పిండి : 2tbps
పనీర్ : 200gms
జీలకర్ర : 1tsp
పచ్చిమిర్చి : 3-4
అల్లం తరుగు : 2tsp
ఉల్లితరుగు : 1/2cup
కొత్తిమీర : ఒక కట్ట
పుదీనా : ఒక కట్ట
ఉప్పు, కారం, నూనె : తగినంత

తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర వేయించాలి.
2. తర్వాత పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు కూడా వేయాలి. ఇవి వేగాక కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి మరో నిముషం వేయించి చల్లారనివ్వాలి.
3. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చే స్తే గ్రీన్ చట్నీ తయారయినట్టు. దీనిని పక్కనుంచుకోవాలి.
4. తర్వాత పనీర్‌ను చిన్న చిన్న స్లైసెస్‌గా చేసుకుని, మధ్యలో ఈ గ్రీన్ చట్నీ పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. శనగపిండిలో బియ్యప్పిండి, ఉప్పు, కారం, నీరు వేసి బజ్జీలపిండిలా కలుపుకోవాలి.
5. ముందుగా స్టఫ్ చేసిన పనీర్ ముక్కలను శనగపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే బాగుంటాయి. అంతే ఈ స్పెషల్ ఈవెనింగ్ ఐటమ్ ను తిని ఎంజాయ్ చేయండి.

English summary

Panner Bajji

Paneer is a versatile cheese. It easily blends into savory or sweet dishes. Here is quick recipe for a evening snack for those hungry little ones returning from school.
Story first published: Tuesday, June 4, 2013, 17:44 [IST]
Desktop Bottom Promotion