For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొటాటో బజ్జీ: ఈవెనింగ్ ట్రీట్

|

బంగాళదుంపలతో తయారుచేసే వంటలంటే పిల్లలకే కాదు, పెద్దలకు కూడా చాలా ఇష్టం. అందరూ ఎక్కువగా ఇష్టపడే వెజిటేబుల్ బంగాళదుంప. ఈ వెజిటేబుల్ తో తయారుచేసే వంటలే ఏ ఒక్కరూ నో అని చెప్పలేరు. బంగాళదుంపతో బెస్ట్ ఈవెనింగ్ స్నాక్ రిసిపిలను కూడా తయారుచేసుకోవచ్చు.

బంగాళదుంపతో ఫిట్టర్స్ లేదా పొటాటో బజ్జీలను తయారుచేయచ్చు. అందరికీ తెలిసిన చాలా సింపుల్ అండ్ ఈజీ రిసిపి ఇది. మరి మీరు మీ కుటుంబ సభ్యలు పొటోటాలను ఇష్టపడుతున్నట్లైతే, మీరు ఖచ్చితంగా ఈ రుచికరమై పొటాటో బజ్జీలను తయారుచేసి, రుచి చూపించాల్సిందే. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Potato Bajji For An Evening Treat

కావల్సిన పదార్థాలు
పొటాటో - 3 (సన్నగా స్లైస్ గా కట్ చేసుకోవాలి)
శనగ పిండి పిండి - 1 ½cup
నీరు - 1cup
కారం - 1tsp
గరం మసాలా పొడి - 1/2tsp
బేకింగ్ సోడా - చిటికెడు
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: వేయించడానికి తగినంత
ఇంగువ: చిటికెడు

తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపకు పీలర్ తో పొట్టు తీసేయాలి. తర్వాత బంగాళదుంపలను నీటిలో వేసి శుభ్రంగా వాష్ చేయాలి. తర్వాత వాటని సాల్ట్ వాటర్ లో వేసి 15నిముషాలు నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఆ నీటిని వంపేసి, బంగాళదుంపలను సన్నని స్లైస్ గా కట్ చేసుకోవాలి.
3. తర్వాత ఒక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, కారం, గరం మసాలా, బేకింగ్ సోడా, ఇంగువ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అన్ని కలిసిపోయే వరకూ మిక్స్ చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే నీళ్ళు పోసి చిక్కగా మరియు జారుడుగా పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చేత్తో కలుపుకోవాలి.
5. పిండి రెడీ చేసుకొన్న తర్వాత, అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. బంగాళదుంప స్లైస్ కు పూర్తిగా శెనగిపిండి మిశ్రమం పట్టేలా చూసుకోవాలి.
6. ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడయ్యాక అందులో మీడియం మంటకు తగ్గించాలి.
7. నూనె వేడిగా కాగుతున్నప్పుడు అందలో శెనగపిండి మిశ్రమంలో కలిపి పెట్టుకొన్న బంగాళదుంపస్లైస్ ను కాగే నూనెలో వేయాలి.
8. బంగాళదుంపలను అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
9. బాగా ఫ్రై అయిన తర్వాత పొటాటో బజ్జీలను ఒక ప్లేట్ మీద బ్లోటింగ్ పేపర్ పరిచి, దానిమీద పొటాటో బజ్జీలను వేయాలి. ఇది అదనపు ఆయిల్ ను పీల్చుకుంటుంది. అంతే పొటాటో బజ్జీ రెడీ వీటిని టమోటో సాస్ లేదా చిల్లీ సాస్ తో తినవచ్చు.

English summary

Potato Bajji For An Evening Treat

One of the most loved vegetables which every child and adult loves to eat at any part of the day is potatoes. It is one vegetable which no one can say no too either. Today, if you are wondering what to make for your little ones when they return from school, we give you one of the best evening recipes to try out.
Story first published: Thursday, September 18, 2014, 18:09 [IST]
Desktop Bottom Promotion