For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొటాటో ఫ్రైస్ : స్పెషల్ ఈవెనింగ్ స్నాక్

|

మనం మన రెగ్యులర్ డైట్లో బంగాళదుంపలతో తయారుచేసే వంటలను చేర్చుకుంటుంటారు. ఇందులో అధిక కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది ఫ్యాటనింగ్ ఫుడ్ అని తెలిసినా కూడా మనం బంగాళదుంపలతో తయారుచేసే వంటలను తినకుండా మాత్రం ఉండలేం. బంగాళదుంపల్లో అధిక న్యూట్రీషియన్స్ కలిగి ఉండి శరీర పెరుగుదలకు సహాయపడుతుంది.

ముఖ్యంగా పొటాటో బ్లాక్ పెప్పర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి పిల్లలకైతే ఒక హెల్తీ ఈవెనింగ్ స్నాక్ అని చెప్పవచ్చు. ఇది రుచికరంగా ఉండటం మాత్రమే కాదు, ఇది మన శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను అంధిస్తుంది.

Potato Fries-Special Evening Snacks

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 4
రాక్ సాల్ట్: 1tsp
బ్లాక్ పెప్పర్: 1tsp
ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారుచేయు విధానం :
1. బంగాళదుంపను శుభ్రంగా కడిగి పొట్ట తీసేయాలి. తర్వాత వీటిని పొడవుగా సన్నగా ముక్కలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత ఇవి నల్లగా మారకుండా ఉండేందుకు వీటిని ఒక బౌల్లో నీళ్ళు పోసి వాటిలో నానబెట్టుకోవాలి.
3. తర్వాత డీప్ ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి.
4. ఇప్పుడు అందులో బంగాళదుంప ముక్కలను వేసి 5 నిముషాలు డీఫ్ ఫ్రై చేయాలి.
5. బంగాళదుంపలు బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటీని పాన్ లో నుండి తీసి పేపర్ టవల్ మీదకు మార్చాలి. అలా చేసినప్పుడు, బంగాళదుంపలకు అంటిన అదనపు ఆయిల్ తొలగిపోతుంది.
6. ఆయిల్ మొత్తం పేపర్ టవల్ పీల్చేసుకొన్నాక, వేడి మీదనే రాక్ సాల్ట్, పెప్పర్ పౌడర్ ను చిలకరించాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి, చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే పొటాటో ఫ్రై రెడీ...

English summary

Potato Fries-Special Evening Snacks

Many of us avoid including potatoes in our meal as it has high carbs and is considered to be fattening. But yet, we would not resist having potato chips and cheat on our diet. As a matter of fact, potatoes has all the nutrients that are required for proper growth of the body.
Story first published: Thursday, March 13, 2014, 17:51 [IST]
Desktop Bottom Promotion