For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొటాటో మటన్ కట్ లెట్ రిసిపి

|

కట్ లెట్ రిసిపిలు సాధారణంగా ఈవెనింగ్ టైమ్స్ లో ఎక్కువగా తయారు చేసుకుంటారు. ముఖ్యంగా ఈవెనింగ్ స్నాక్స్ గా వీటిని తయారు చేసుకోవచ్చు. కట్ లెట్ చాలా రుచిగా మరియు క్రిస్పీగా ఉంటాయి.

ఈ కట్ లెట్ ను కొంచెం వెరైటీగా మటన్ కు పొటాటో చేర్చి అద్భుతంగా తయారు చేయవచ్చు. ఈ కట్ లెట్ రిసిపి చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. మరియు మీరు ఈ వెరైటీ కట్ లెట్ ను టేస్ట్ చేయాలనుకుంటే తయారు చేయు విధానం తెలుసుకోండి మరి...

మటన్ ఖీమా: 200grms
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
వినెగార్: 1tsp
పచ్చిమిరపకాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
గరం మసాలా: 1/2 tsp
పెప్పర్: 1/2 tsp
కొత్తిమీర: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఛాట్ మసాలా: 1/1 స్పూన్
బంగాళ దుంపలు: 2(ఉడికించినవి)
మొక్కజొన్న పిండి: 1cup
ఆయిల్: 1cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. పాన్ లో ఒక చెంచా నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడియ్యాక, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, మీడియం మంట మీద రెండు నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులో మటన్ ఖీమా వేసి మరో నాలుగు నిముషాలు పాటు వేగించాలి.
2. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి, వేసి రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే పెప్పర్, ఛాట్ మసాలా, ఉప్పు, గరం మసాలా వేసి మరో 5నిముషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
4. ఇప్పుడు కొత్తిమీర తరుగు, అరకప్పు నీళ్ళు పోసి, మూత పెట్టి పది నిముషాలు ఉడికించాలి.
5. అంతలోపు బంగాళదుంపలను నీళ్ళలో వేసి ఉప్పు చేర్చి ఉడికించుకోవాలి. తర్వాత పక్కన తీసి, చల్లారబెట్టాలి.
6. బంగాళదుంప చల్లారిన తర్వాత పక్కన పొట్టు తీసి బాగా చిదిమి అందులో ఖీమా కూడా వేసి మిక్స్ చేసి, తర్వాత కార్న్ ఫ్లోవర్ వేసి రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి బాగా సున్నితంగా కలిపి పెట్టుకోవాలి.
8. తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా చేతిలోనికి తీసుకొని ఉండచేసి, అరచేతిలో పెట్టుకొని కట్ లెట్ లా వత్తుకోవాలి.
9. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో ఒక కప్పు నూనె వేసి, బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత అందులో, కట్ లెట్ ను వేసి కాలనివ్వాలి. తర్వాత వీటిని మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలి.

పొటాటో మటన్ కట్ లెట్ ను గ్రీన్ సలాడ్ తో సర్వ్ చేయాలి.

English summary

Potato n Mutton Cutlet Recipe

Ideally, we do not begin our day with a very heavy meal. However, that is not scientifically very correct. You can have your heaviest meal in the day in the morning. And the earlier in the day you have your proteins, the better it is. That is why a mutton cutlet recipe for breakfast shouldn't surprise you.
Desktop Bottom Promotion