For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్-ఖర్జూరం ఖీర్ : రంజాన్ స్పెషల్

|

ఇండియన్ డిజర్ట్స్ లో ఖీర్ చాలా ఫేమస్ వంటకం. ముఖ్యంగా ఖీర్ మన ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతారు. ఖీర్ మన భోజనంలో ఒక స్పెషల్ డిజర్ట్ గా తీసుకోవడం అలనాటి కాలం నుండి ఒక ఆనవాయి. ఒక్క హిందువులకు మాత్రమే కాదు, ముఖ్యంగా ముస్లీములు తయారుచేసే ఖీర్ చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుంది.

ఆపిల్ మరియు డేట్స్ (ఖర్జూరాలతో)తయారుచేసే ఖీర్ చాలా ఆరోగ్యకరం. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారు ఒక శక్తివంతమైన ఆహారాల్లో డేట్స్ తో తయారుచేసే వంటలు కూడా ఒకటి. డేట్స్ తో తయారుచేసే వంటలకు రంజాన్ మాసంలో చాలా ప్రత్యేకత ఉంది. అంతే కాదు, డయాబెటిక్ ఉన్నవారు కూడా చాలా సంతోషకరంగా తీసుకోగలిగిన డిజర్ట్ ఇది. ఈ ఖీర్ ను లో ఫ్యాట్ మిల్క్ తో తయారుచేస్తారు. ఈ ఖీర్ తయారుచేయడానికి నేచురల్ స్వీట్నర్, వాల్ నట్స్ ఆపిల్స్, వేయడం వల్ల మరింత టేస్టీగా క్రంచీగా ఉంటుంది. మరి ఈ రంజాన్ స్పెషల్ ఆపిల్ డేట్స్ ఖీర్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:

ఆపిల్ : 1 (సన్నగా తరగాలి)
పంచదార : 1tsp
పాలు : 3cups(ఫ్యాట్ తక్కువ ఉన్నవి)
సన్నగా తరిగిన ఖర్జూరాలు : 1cup
గార్నిషింగ్ కోసం:
వాల్‌నట్స్ : 1tbsp(సన్నగా తరగాలి)
ఆపిల్ : చిన్న ముక్క (సన్నగా తరగాలి)

pple-Dates Kheer: Ramzan Special

తయారు చేయు విధానం:
1. ముందుగా నాన్‌స్టిక్ పాత్రలో... ఆపిల్ ముక్కలు, పంచదార, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి సన్న మంట మీద ఆపకుండా కలుపుతూ, కొద్దిసేపు ఉడికించి దించేయాలి
2. తర్వాత చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి.
3. తర్వాత ఒక పాత్రలో పాలు, ఖర్జూరం తరుగు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి సన్నని మంట మీద పది నిముషాలు ఆపకుండా కలుపుతూ ఉడికించి దించేయాలి.
4. చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి. సర్వ్ చేసే ముందు ఉడికించిన ఆపిల్ మిశ్రమాన్ని, ఖర్జూరం మిశ్రమానికి జత చేసి నెమ్మదిగా కలపాలి.
5. తర్వత వాల్‌నట్స్ తరుగు, ఆపిల్ ముక్కలతో అలంకరించి చల్లచల్లగా అందించాలి. అంతే ఆపిల్ మరియు డేట్స్ ఖీర్ రెడీ.

English summary

pple-Dates Kheer: Ramzan Special

Kheer has always been a part of the indian spread. Times have changed, but kheer continues to find a special place in our meal! over time, several variations of kheer have emerged. Here i present a very healthy version, especially for diabetics a dessert made with apples and dates cooked in low fat milk and sweetened with sugar substitutes. Dates and apples impart their natural sweetness and fibre, while walnuts add crunch and taste to this kheer.
Story first published: Saturday, July 19, 2014, 17:03 [IST]
Desktop Bottom Promotion