For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేమియా పాయసం: రంజాన్ స్పెషల్

|

రంజాన్ మాసంలో సేమాయకు చాలా డిమాండ్. ఎందకంటే ముస్లీములకు అత్యంత ప్రీతికరమైన స్వీట్ వంటకం సేమియా పాయసం. రంజాన్ మాసంలో వివిధ రకాల సాంప్రదాయ వంటల్లో సేమియా పాయసం ఒకటి. కొన్ని వెజిటేరియన్ రిసిపిలు కూడా ఇఫ్తార్ కు చాలా గ్రేట్ గా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన వంటలు రంజాన్ మాసంలో మాత్రమే ప్రత్యేకంగా తయారుచేస్తుంటారు. అందులో ఒకటి క్వామి సేవియా. ఇది లక్నో స్పెషల్ సేమియా పాయసం. ముస్లీములు ఉపవాస వేళల్లో ఈ సేమియా వంటను స్పెషల్ గా తయారుచేస్తారు.

క్వామి సేవియా చాలా డిఫరెంట్ రంజాన్ రిసిపి. సాధారణంగా సేవియా లేదా వర్మిసెల్లీతో తయారుచేసే పాయం పాలు మరియు పంచదార సిరఫ్ తో సాగీగా తయారుచేస్తారు. అయితే ఈ లక్నోస్పెషల్ డిష్, వెర్మిసెల్లీ(సేమియా)కొద్దిగా డ్రైగా తయారుచేస్తారు మరియు స్వీట్ గా ఉండే ఈ సేవియాకు బాదం పిస్తాతో గార్నిష్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. మరి ఈ లక్నో స్పెషల్ సేమియా పాయసంను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Qawami Seviyan: Lucknowi Ramzan Recipe

కావల్సిన పదార్థాలు:

సేమియా: 2cup
నెయ్యి: 1cup
పాలు: 3cups
యాలకలు: 4-5
లవంగాలు: 4-5
పంచదార: 1cup
బాదాం: 10
పిస్తా: 10
కుంకుమపువ్వు: 1 చిటికెడు

తయారుచేయు విధానం:

1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో యాలకలు, లవంగాలు ఒక సెకను ఫ్రై చేయాలి.
2. తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమియాను కూడా అదే పాన్ లో వేసి ఫ్రై చేసుకోవాలి.
3. సేమియా పూర్తిగా బ్రౌన్ కలర్ కు (బర్న్ కాకుండా)మారకుండా 5నిముషాలు చాలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. అంతలోపు పాన్ లో రెండు కప్పుల నీళ్ళు పోసి, నీరు మరుగుతున్నప్పుడు అందులో పంచదార వేసి, బాగా మరిగించాలి. పంచదార సిరఫ్ చిక్కగా మారే వరకూ (5-10)నిముషాలు ఉడికించాలి.
5. షుగర్ సిరఫ్ రెడీ అయిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న సేమియాను వేసి, రెండు మూడు కప్పుల పాలు పోసి మొత్తం మిశ్రమాన్ని ఉడికించాలి.
6. 5నిముషాలు ఉడికించిన తర్వాత పాలు కొద్దిగా క్రీమీగా తయారవుతుంది. అప్పుడు ఫ్రై చేసుకొన్న లవంగాలు, యాలకులు వేసి మిక్స్ చేసి బాదం మరియు పిస్తాతో గార్నిష్ చేయాలి. అంతే స్టై ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టి మరింత చల్లచల్లగా ఇఫ్తార్ విందుకు సర్వ్ చేయాలి.

English summary

Qawami Seviyan: Lucknowi Ramzan Recipe


 People have this conception that Ramzan recipes only incorporate meat and biriyani at the most. However, there is a wide variety in Ramzan recipes as well. There are vegetarian dishes that make great Iftar recipes and also some of the greatest sweet dishes that are only made during Ramzan.
Story first published: Thursday, July 24, 2014, 11:55 [IST]
Desktop Bottom Promotion