For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రా మ్యాంగో(పచ్చిమామిడి కాయ)సలాడ్

|

వేసవి కాలం వస్తే చాలు, మామిడితో ఏదో ఒక కొత్త టేస్ట్ ను రుచి చూడాలనిపిస్తుంది. మామిడితో తయారు చేసే సలాడ్స్, ఊరగాయాలు, సాంబార్లు, లస్సీలు, జ్యూసులు ఇలా ఒకటేమిటి బోలెడు రుచులు వేసవి కాలం అంతా కమ్మగా నోటికి రుచిగా పుల్లగా అంధిస్తుంటాయి మామిడిపండ్లు.

అయితే పచ్చిమాడితో మాత్రం వేసవిలో పన్నా, సలాడ్స్ భలే రుచిగా ఉంటాయి. పచ్చిమామిడి బెల్ పెప్పర్ కాంబినేషన్ లో తాయరు చేసే సలాడ్ చాలా రుచికరంగా ఉంటుంది. అంతే కాదు ఆరోగ్యానికి చలువకూడా చేస్తుంది. ఇంకా ఇందులో కలర్ ఫుల్ గా కీరదోస ముక్కలు, రెడ్ అండ్ గ్రీన్ బెల్ పెప్పర్ తురుము, కొబ్బరి తురము, పచ్చిమిర్చి భలే రుచిగా ఉంటాయి. పూర్తి పోషకాంశాలు శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ పచ్చిమామిడి పెప్పర్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Raw Mango Salad
కావలసిన పదార్థాలు:

నువ్వు పప్పు : 1tbsp
పల్లీలు :1tbsp
బెల్లం : 1tbsp
పచ్చి మామిడికాయ తురుము : 1cup
రెడ్ క్యాప్సికమ్ తరుగు : 1/2cup
ఎల్లో క్యాప్సికమ్ తరుగు : 1/2 cup
కొత్తిమీర తరుగు : 4tbsp
ఉప్పు : తగినంత
మిరియాల పొడి : తగినంత

తయారుచేయు విధానం:

1. బాణలిని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక నువ్వుపప్పు, పల్లీలు విడివిడిగా వేసి వేయించి తీసేయాలి
2. చిన్న రోలు వంటి దాంట్లో పల్లీలు, నువ్వుపప్పు, బెల్లం వేసి, పొడిపొడిలా అయ్యేలా దంచి తీసి పక్కన ఉంచాలి
3. ఒక పాత్రలో పచ్చి మామిడికాయ తురుము, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. (ముందుగా వీటిని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడనివ్వాలి)
4. సర్వింగ్ బౌల్స్‌లో కొద్దికొద్దిగా వేసి, పైన కొత్తిమీర, పల్లీలు + నువ్వుపప్పు + బెల్లం మిశ్రమం చల్లి అందించాలి.

English summary

Raw Mango Salad

This green mango salad recipe will blow you away with its tastebud-awakening flavors. In fact, this salad recipe is so delicious.
Story first published: Saturday, May 31, 2014, 17:29 [IST]
Desktop Bottom Promotion