For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేరియన్స్ కోసం స్పెషల్ సోయా కబాబ్

|

సాధారణంగా కబాబ్ రిసిపిలు అంటే మాంసాహారంతోనే తయారు చేస్తారనుకుంటారు. నిజానికి కబాబ్ రిసిపీలలో మాంసం లేదా మాంసాహారంకు ఉపయోగించే పదార్థాలు నిండి ఉంటాయి. కానీ, వెజిటేరియన్స్ వారి టేస్ట్ బడ్స్ తో ఏ మాత్ర కాంప్రమైజ్ కానవసరం లేదు. ఎందుకంటే సోయా బీన్ కబాబ్ రిసిపి, పక్కా వెజిటేరియన్ కబాబ్ టేస్ట్ తో అద్బుతంగా ఉంటుంది. సోయా బీన్ కబాబ్ రిసిపిలు వెజిటేరియన్స్ కు ఫర్ ఫెక్ట్ రిసిపి. ఎందుకంటే వీటిలో సోయా చుంక్స్ ను ఉపయోగిస్తాము కాబట్టి.

వెజిటేరియన్స్ పాల ఉత్పత్తులకు బదులు, సోయా ప్రొడక్ట్స్ ను ఎవరైతే ఉపయోగిస్తారో అటువంటి వారికి కూడా సోయా బీన్ కబాబ్ తో కూడా ఎంజాయ్ చేయవచ్చు. సోయా బీన్ కబాబ్ తయారు చేయడం చాలా సులభం. అందుకు కావల్సిందల్లా సోయా చుంక్స్ మాత్రమే. తర్వాత మన ఇండియన్ మసాలాలను జోడించి చాలా సింపుల్ గా, టేస్టీగా తయారుచేయవచ్చు. మరి సోయా బీన్ కబాబ్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Soya Bean Kebab

కావల్సిన పదార్థాలు:
సోయా లేదా మీల్ మేకర్ (soya chunks):10(పెద్దవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చిమిరపకాయలు: 4
ఉల్లిపాయ : 1
కొత్తిమీర: కొద్దిగా
పెరుగు: 2tbsp
కారం: 1/2tsp
గరం మసాలా పొడి: 1tsp
పెప్పర్ పౌడర్: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా సోయాచుంక్స్ ను వేడి నీళ్ళలో వేసి 10నిముషాలు నాననివ్వాలి. పది నిముషాల తర్వాత ఈ నీటిని పారబోసి, సోయాచుంక్స్ పక్కకు తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఆ సోయా చుంక్స్ మీద కొద్దిగా అల్లం వెల్లుల్లిపేస్ట్ మరియు ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టాలి.
3. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేయాలి.
4. ఇప్పుడు ఈ పేస్ట్ ను పెరుగుతో మిక్స్ చేసి బాగా గిలకొట్టాలి.
5. ఈ మిశ్రమాన్ని అల్లం, వెల్లుల్లిపేస్ట్ తో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న సోయా చుంక్స్ మీద పోయాలి. ఒక సారి మిక్స్ చేసి 10నిముషాల పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత మైక్రోఓవెన్ ను 200డిగ్రీలకు ఓవర్ హీట్ చేయాలి.
7. ఇప్పుడు బేకింగ్ డిష్ లో మ్యారినేట్ చేసిన సోయా చుంక్స్ ను సర్ధాలి. ఇప్పుడు వాటిమీద మిగిలిన మ్యారినేట్ మిశ్రమాన్ని కూడా పోయాలి.
8. తర్వాత వాటిమీద నూనెను స్ప్రే చేయాలి.
9. పది నిముషాలు, 60పర్సెంట్ పవర్ లో గ్రిల్ చేయాలి
10. సోయా చుంక్స్ ను ప్రతి 3-4నిముషాలకొకసారి టర్న్ చేసి గ్రిల్ చేయాలి. అంతే సోయా బీన్ కబాబ్ రెడీ. వీటిని సలాడ్ లేదా ఉల్లిపాయ చక్రాలతోటి సర్వ్ చేయండి.

English summary

Soya Bean Kebab Recipe For Vegans

Kebab recipes are usually a meaty affair. The fact remains that most kebab recipes contain meat or non-vegetarian ingredients. But vegetarians do not have to compromise with their taste buds anymore. The soya bean kebab recipe gives a vegetarian kebab that is absolutely delicious.
Story first published: Thursday, September 19, 2013, 17:02 [IST]
Desktop Bottom Promotion