For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ ధనియా వడ రిసిపి: మాన్ సూన్ స్పెషల్ స్నాక్

|

వర్షాకాలంలో చాలా మందికి స్నాక్స్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎక్కువగా పిల్లలు మరియు పెద్దలు కూడా ఇష్టపడుతారు. టీ టైమ్ స్నాక్స్ కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా వర్షకాలంలో ప్రతి రోజూ స్పైసీగా ఏదో ఒక స్నాక్ తినాలనే కోరిక కలిగి ఉంటారు. మిమ్మల్ని బయటకు కదలనివ్వకుండా వర్షం పడుతుంటే తప్పనిసరిగా స్నాక్ మీదే మనస్సు మళ్ళుతుంది, అటువంటప్పుడు వేడి వేడిగా ఏదోఒకటి తయారుచేసుకొని తినాలనిపిస్తుంది.

అటువంటి మాన్ సూన్ స్నాక్ రిసిపిల్లో ఒక రుచికరమైన ధనియా స్నాక్ రిసిపి ఒకటి. దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా తక్కువ సమయంలో టేస్టీగా మరియు క్రిస్పీగా మంచి కొత్తిమీర ఫ్లేవర్ తో డిఫరెంట్ గా ఈ స్నాక్ రిసిపిని తయారుచేయవచ్చు. ఈ స్నాక్ రిసిపికి అవసరం అయ్యే వస్తువులు అతి సులభంగా మన ఇంట్లో అందుబాటులో ఉంటాయి. మరి ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Dhaniya Vada Recipe

కావల్సిన పదార్థాలు:
శెనగపిండి: 2cups
(ధనియా లీవ్స్)కొత్తిమీర తరుగు: 1 కట్ట
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా
ఆమ్చూర్ (మామిడి పొడి): 1tsp
కారం పొడి: 1tsp
బియ్యం పిండి: 2tbsp
నీళ్ళు: 1/2cup
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా శెనగపిండి, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, డ్రైమ్యాంగో పొడి, కారం పొడి మరియు బియ్యం పిండి అన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులోనే సరిపడా నీళ్ళు పోసి చేత్తో బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి.
3. తర్వాత పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకొని, ఉండలా చేసి అరచేతిలో పెట్టి ఫ్లాట్ గా వత్తుకోవాలి.
4. అంతలోపు స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి.
5. నూనె వేడవ్వగానే అందులో వత్తుకొన్న వడలను అందులో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
6. వడలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అన్ని వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం తయారుచేసుకొని సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకొని, కెచప్ లేదా సాస్ తో సర్వ్ చేయాలి. అంతే ధనియా వడ రెడీ.

English summary

Spicy Dhaniya Vada Recipe

Monsoon is knocking at your door. The time has finally arrived when you can sit by your balcony, enjoying a hot cup of tea with some fried delights. Monsoon is the best time to enjoy your tea time snacks. The pouring rain outside prevents you from going out anywhere and provides you with ample time to fry up something for yourself.
Story first published: Wednesday, October 15, 2014, 16:38 [IST]
Desktop Bottom Promotion