For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీ టైమ్ స్టార్టర్ : స్పైసీ అండ్ టేస్టీ ప్రాన్ ఫ్రై రిసిపి

రెగ్యులర్ గారెగ్యులర తయారుచేసుకునే చికెన్ రిసిపిల కంటే కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నిస్తే కొంచెం రిఫ్రెష్ గా..కొత్త రుచిని టేస్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఫ్రాన్ ఫ్రై రిసిపిని త్వరగా తయారుచేసుకోవచ్చు. .

|

రెగ్యులర్ గా తయారుచేసుకునే చికెన్ రిసిపిల కంటే కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నిస్తే కొంచెం రిఫ్రెష్ గా..కొత్త రుచిని టేస్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఫ్రాన్ ఫ్రై రిసిపిని త్వరగా తయారుచేసుకోవచ్చు. .

సహజంగా సీఫుడ్ విషయానికొస్తే , చాలా మంది ఇల్లలో చాలా పాపులర్ అయినటువంటిది. ప్రాన్స్ తో వివిధ రకాల వెరైటీ వంటలను ట్రై చేయవచ్చు. వీటి వంటలు తయారుచేయడం కూడా చాలా సులభంగా, తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. ప్రాన్స్ తో వివిధ రకాల వంటలను తయారుచేసుకుని తినడమంటే చాలా మందికి ఇష్టం.
కొన్ని రెగ్యులర్ మసాలా దినుసులతో పాటు ప్రాన్స్ తో కర్రీస్, ఫ్రైలు తయారుచేసుకుని తినడం వల్ల మంచిగా డిఫరెంట్ రుచిని ఆస్వాదిస్తుంటారు. అంతే కాదు దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో డిఫెరెంట్ స్టైల్లో తయారుచేసుకుంటారు. ది బెంగాలి చింగ్రి(ప్రాన్ )మలైకర్రీ గోవా వంటి ప్రదేశంలో చాలా డిఫరెంట్ గా తయారుచేస్తుంటారు. గోవాన్ ప్రాన్ కర్రీ చాలా వెరైటీగా ఉంటుంది

అందువల్ల, మీరు కూడా ప్రాన్స్ తో ఏదైనా డిఫరెంట్ గా..క్రిస్పిగా తప్రయత్నించాలనుకుంటే మీకోసం ఒక డిఫరెంట్ ప్రాన్ కర్రీ రిసిపి ఉంది. దీన్నిఈవెనింగ్ టీ లేదా కాఫీతో స్ట్రార్టర్ గా కూడా తీసుకోవచ్చు. మరి అటువంటి అద్భుతమైన రుచికలిగిన ప్రాన్ స్నాక్ ను మనం ఈ రోజు ప్రయత్నిస్తాం..అందుకు కవాల్సిన పదార్థాలు, తయారీ గురించి వివరంగా తెలుసుకుందాం..

 Spicy Prawn Fry Recipe

కావల్సిన పదార్థాలు :
ప్రాన్స్ - 600 g (క్లీన్ చేసినవి)
రెడ్ చిల్లీ పౌడర్ - 2 tsp
పసుపు- ½ tsp
నూనె - 5 tbsp
ధనియాల పొడి - 1½ tbsp
రుచికి సరిపడా ఉప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1½ tbsp
ఉల్లిపాయలు - 1 tbsp (finely chopped)
కరివేపాకు - 7-8
నీళ్లు - ½ cup

తయారుచేయు విధానం:
ఒక బౌల్ తీసుకుని, అందులో ప్రాన్స్, ఉప్పు, కారం, ధనియాలపొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

10 నిముషాల తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకుని, నూనె వేసి వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసి వేగించాలి. కరివేపాకు కూడా వేసి, ఫ్రై చేయాలి.

అలాగే అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, మూత పెట్టి 10 నిముషాలు ఉడికించుకోవాలి.

10 నిముషాల తర్వాత ప్రాన్స్ ను మరో పాన్ లో కి తీసి, మరికొద్దిగా నూనె వేసి, డ్రై ఫ్రై చేసుకోవాలి.

డ్రైగా ఫ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

English summary

Spicy Prawn Fry Recipe

Try something different today than the regular chicken recipes. Here's a prawn fry recipe that could be prepared in minutes, which you've got to give it a try.
Story first published: Thursday, May 18, 2017, 17:49 [IST]
Desktop Bottom Promotion