For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టఫ్డ్ బ్రెడ్ పకోడా-మాన్ సూన్ స్పెషల్

|

వర్షాకాలంలో సాయంత్రపు చిరుజల్లుల్లో ప్రతి ఇంట్లోనూ వేడివేడిగా కాఫీతో పాటు, కారంగా ఏదైనా చిరుతిండ్లు చేసుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. మన ఇండియాలో వర్షాకాలం అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. వర్షాకాలంలో ఇంట్లో వారందరూ ఒక చోట చేరి వేడి వేడి కాఫీ, ఛాట్స్ తీసుకుంటు కబుర్లు చెప్పుకుంటుంటారు. ఛాట్స్ అంటే ముఖ్యంగా బజ్జీ, పకోడా..పకోడాలో వివిధ రకాలున్నాయి. అందులో ఉల్లిపాయ పకోడా లేదా ఆలూ పకోడ లేదా బ్రెడ్ పకోడా ఇలా వివిధ రకాలు వర్షాకాలంలో ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే చిరుతిండ్లు.

సాధారణ బ్రెడ్ పకోడా కంటే స్టఫ్డ్ బ్రెడ్ పకోడా అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. వర్షకాలంలో దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బంగాళదుంపను స్టఫ్ చేయడం వల్ల మరి రుచి, ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మరి మీరు ఈ కొత్త రుచిని టేస్ట్ చేయాలంటే ఒక సారి ప్రయత్నించండి..

Stuffed Bread Pakora Recipe

కావల్సిన పదార్థాలు:
బ్రెడ్ స్లైస్: 5
బంగాళదుంప: 2(పెద్దవి, ఉడికించి, మెత్తగాచిదిమి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకొన్నవి)
శెనగపిండి: 4tbsp
కారం: 1tsp
ఆమ్ చూర్: 1tsp(డ్రై మ్యాంగో పౌడర్)
జీలకర్ర: 1tsp
పచ్చిమిర్చి: 2(సన్నగా తరుగుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
టమోటో కెచప్: 2tbsp
కొత్తిమీర తరుగు: 1tbsp
నూనె: 2-3cups(డీప్ ఫ్రై కోసం)
నీళ్ళు: 1/2cup

తయారు చేయు విధానం:
1. ముందుగా ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపలు, ఉప్పు, కారం, ఆమ్ చూర్, వేగించిన జీలకర్రపొడి, పచ్చిమిర్చి మరియు కొత్తిమీర అన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి.

2. బ్రెడ్ స్లైస్ ను ట్రైయాంగిల్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ మీద టమోటో కెచప్ ను స్ప్రెడ్ చేయాలి.

3. తర్వాత దాని మీద బంగాళదుంప మిశ్రమాన్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత దాని మీద మరో బ్రెడ్ స్లైస్ ను పెట్టాలి.

4. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండి, జీలకర్ర, ఉప్పు, నీళ్ళుపోసి చిక్కగా జారుడుగా కలుపుకోవాలి.

5. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పొటాటో బ్రెడ్ స్లైస్ ను శెనగపిండి మిశ్రమంలో డిప్ చేయాలి.

6. అంతలోపు, స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి ఎక్కువ మంట పెట్టి నూనె బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి, తర్వాత శెనపిండి మిశ్రమంలో డిప్ చేసి పెట్టుకొన్న బ్రెడ్ స్లైస్ ను, కాగే నూనెలో వేసి మీడియం మంట మీద 3-4నిముషాలు అన్నివైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ కాల్చుకోవాలి.

7. బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకొన్న బ్రెడ్ పకోరాను వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని, వేడి వేడి బ్రెడ్ పకోడాను కెచప్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. స్టఫ్డ్ బ్రెడ్ పకోర అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ పకోడను టీ లేదా కాఫీ కాంబినేషన్ తో సర్వ్ చేయండి.

English summary

Stuffed Bread Pakora Recipe

A rainy evening with cups of steaming hot tea and crispy pakoras- a common scenario in almost every Indian household. The monsoons in india are very special. It is the most celebrated excuse for family members to gather for tea and snacks while watching the rains pour down.
Story first published: Thursday, June 27, 2013, 17:59 [IST]
Desktop Bottom Promotion