For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ అరిసెలు: ఉగాది స్పెషల్ స్వీట్స్

|

ఉగాది తగ్గరలో రాబోతోంది. ఇప్పటికే మీరు మీకు ఇష్టమైన ఉగాది పండుగ పనులను ప్రారంభించేసుంటారు. ఉగాదిని కొత్త సంవత్సరంగా పిలుకొనే మన తెలుగువారికి స్వీట్స్ లేకుండా, ఉగాది సంబరాలు ఎలా ముగుస్తాయి. అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ఒకరకంగా మన సంప్రదాయ వంట అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉగాది పండుగకు అరిసెలు కూడా చేస్తుంటారు. పోలీలతో పాటు అరిసెలను కూడా వండి, వచ్చే అథితులకు ఆథిద్యం ఇస్తుంటారు. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు. ఈ అరిసెలు పెళ్ళైన ఆడపిల్లకి పెట్టే సారెలో కూడా తప్పకుండా పెడతాము.

అరిసెలు ఒక పాపులర్ స్వీట్ రిసిపి వీటిని ఎక్కువగా కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వీటిని వండుతారు. అరెసెలు చేయటం కొంచెం కష్టమైన పనే అయినా... చాలా రుచికరంగా ఉంటాయి. అరిసెలు చేయడం రెండు రోజుల పని. మొదటి రోజు బియ్యం నానబెట్టుకోవటం, రెండవ రోజు ఆ నానిన బియ్యాన్ని పిండి పట్టించి మెత్తగా జల్లించి ఈ పిండిని బెల్లం పాకం పట్టి అందులో జల్లించిన పిండిని కలిపి అరిసెలు చేసుకోవటం ఇది అరిసెల ప్రహసనం....

Sweet Ariselu Recipe For Ugadi

కావలసిన పదార్థాలు:
బియ్యం: 1kg
బెల్లం తరుము: 1/2kg
నువ్వులు: 100grms
నీరు: 1cup(తగినంత)
యాలకులు: 2-4(మెత్తగా పొడిచేసుకోవాలి)
నెయ్యి: 1/2cup
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెల్లో వడవేసి పిండి పట్టించుకోవాలి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెద్దది పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం) పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
3. తర్వాత బియ్యం పిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి. ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంతవరకూ పిండి వేసి కలపాలి. 4. ఇలా పిండి పాకంతో తయారు చేసుకొన్న తర్వాత స్టౌ ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి కాగనివ్వాలి. ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెలు వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి.
5. బంగారు వన్నె రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత భద్రపచుకోచ్చు. ఇవి ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. అంతే నోరూరించే అరిసెలు రెడీ..!

English summary

Sweet Ariselu Recipe For Ugadi

Ugadi is just round the corner. You must have already started preparing for this lovely festival. Ugadi marks the beginning of a new year and a new beginning should always be celebrated with sweets. So, today we have a sweet recipe for you to try on Ugadi.
Story first published: Saturday, March 22, 2014, 15:40 [IST]
Desktop Bottom Promotion