For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 డిఫరెంట్ స్వీట్స్: శ్రీరామ నవమి స్పెషల్

|

శ్రీరామనవమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో మనందరికీ తెలిసిన విషయమే. ఈ సెలబ్రేషన్స్ వసంత నవరాత్రుల్లో తొమ్మిదో రోజు మరియు చివరి రోజున వసంత నవరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజున శ్రీరామును పుట్టినరోజు సందర్భంగా చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసం తీర్చుకుంటారు .

పండుగల్లో ఫాస్టింగ్ మరియు ఫీస్టింగ్ రెండూ కూడా మన పండుగ సాంప్రదాయల్లో ముఖ్యమైనవే. ఏదేమైనా ఉపవాస సమయంలో అల్పాహారాలతో పాటు, పండుగ సందర్భంగా కాస్త స్వీట్స్ తీసుకోవడం కూడా ఆనవాయితీ. ముఖ్యంగా నెయ్యితో తయారు చేసిన కొన్ని స్వీట్స్ ను ప్రత్యేకంగా శ్రీరాముడికి నైవేద్యం పెట్టి, ఉపవాసం ఉన్న వారు కూడా ప్రత్యేకంగా తీర్చుకుంటారు. అటువంటి వాటిలో కొన్ని స్వీట్ రిసిపిలను బోల్డ్ స్కై లిస్ట్ చేసి ఈ క్రింది విధంగా మీ ముందు ఉంచుతోంది....

కొబ్బరి లడ్డు -నవరాత్రి స్పెషల్

కొబ్బరి లడ్డు -నవరాత్రి స్పెషల్

ఏ ఇండియన్ ఫెస్టివల్ అయినా సరే స్వీట్స్ లేకుండా పండుగ జరగదు. వసంత నవరాత్రి ప్రారంభమైంది. ఉపవాసం ఉండే ఈ రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో వంటను రుచిచూడవచ్చు. ఉపవాసంలో టేస్టీ మరియు హెల్తీ రిసిపిలను తయారుచేసుకోవచ్చు.

సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫిర్నీ

సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫిర్నీ

పాలు మరియు బాస్మతి బియ్యంతో తయారు చేసే ఫిర్నీ సహజంగా ఇది నార్త్ ఇండియన్ డిజర్ట్ . ఇండియన్ వంటకాల్లో ఇది ఒక వెరైటీ రైస్ పుడ్డింగ్ అంటే ఖీర్, పాయసం, వంటిదన్నమాట. అయితే ఫిర్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ బియ్యాన్ని నానబెట్టి, పేస్ట్ చేసి పాలతో ఉడికిస్తారు. ఇది ముగలైయ్ కుషన్. ఇది ట్రెడిషనల్ రిసిపి, చూడటానికి నోరూరిస్తూ..కలర్ ఫుల్ గా ఎల్లో ఫ్లేవర్లో ఉంటుంది. దీన్ని పిస్తా..బాదాంతో గార్నిష్ చేస్తే మరింత టేస్ట్.

కాజు బర్ఫీ

కాజు బర్ఫీ

కాజు బర్ఫీ చాలా టేస్టీగా ఉండే స్వీట్ రిసిపి. మార్కెట్లో దీని ధరకూడా ఎక్కువే. సాధారణంగా దీపావళికి వివిధ రకాల స్వీట్స్ ను తయారుచేస్తుంటారు. అందులో కాజు బర్ఫీ కూడా ఒకటి. సాధారణంగా వీటిని రోల్స్ లా తయారుచేస్తుంటారు. బర్ఫీగా చేయడం అంటే కొంత రిస్కే. ఎందుకంటే బర్ఫీఫీకి షుగర్ సిరఫ్ పర్ఫెక్ట్ గా కుదరాలి. షుగర్ సిరప్ చిక్కగా ఉంటే, బర్ఫీ గట్టిగా తయారువుతుంది, అయితే సిరఫ్ చాలా పల్చగా ఉన్నాకష్టమే. కాబట్టి షుగర్ సిరఫ్ మీడియంగా ఉండేలా చూసుకోవాలి.

స్వీట్ హాల్వా-నవరాత్రి స్పెషల్ స్వీట్

స్వీట్ హాల్వా-నవరాత్రి స్పెషల్ స్వీట్

అల్పాహరం అంటే రెగ్యులర్ గా తయారు చేసేవి కాకుండా కొంచెం డిఫరెంట్, బుక్వీట్, రాక్ సాల్ట్, జీడిపప్పు పౌడర్ వంటి వాటితో తయారు చేసి వంటలు కూడా ఉన్నాయి. వీటితో తయారుచేసే వంటలను ఉపవాసం ఉన్నవారు తీసుకోవచ్చు. మరి అటువంటి వారికోసం ఇక్కడ ఒక స్పెషల్ స్వీట్ ను ఎలా తయారుచేయాలో ఇవ్వడం జరిగింది. దీన్ని తయారుచేసి ఉపవాసం ఉన్నవారు లేని వారు కూడా ఈ స్వీట్ తిని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ నవరాత్రి స్పెషల్ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

మఖాన కీర్: నవరాత్రి స్పెషల్ స్వీట్

మఖాన కీర్: నవరాత్రి స్పెషల్ స్వీట్

వసంత నవరాత్రి ఉపవాసాలు ప్రారంభమైనాయి. నవరాత్రి స్పెషల్ ఉపవాస పలహారలు, స్వీట్స్, తయారుచేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. . ఇవి తినడానికి టేస్టీగా హెల్తీ మరియు కడుపు నింపేవిగా ఉంటాయి. ఖీర్ అనేది మన ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి స్వీట్ డిష్. ముఖ్యంగా పండుగ సందర్భంగా వీటిని తయారు చేసుకుంటారు.

రోజ్ ఫిర్ని

రోజ్ ఫిర్ని

పాలు మరియు బాస్మతి బియ్యంతో తయారు చేసే రోజ్ ఫిర్నీ నార్త్ ఇండియన్ డిజర్ట్ . ఇండియన్ వంటకాల్లో ఇది ఒక వెరైటీ రైస్ పుడ్డిం, అంటే ఖీర్, పాయసం, వంటిదమాట. అయితే ఫిర్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ బియ్యాన్ని నానబెట్టి, పేస్ట్ చేసి పాలతో ఉడికిస్తారు.

చల్ల చల్లని..తియ్య తియ్యని..మ్యాంగో రసగుల్లా

చల్ల చల్లని..తియ్య తియ్యని..మ్యాంగో రసగుల్లా

ప్రస్తుతం మ్యాంగో సీజన్ కాబట్టి..చాలా వరకూ అందరికీ మామిడి పండ్లంటే ఇష్టం కాబట్టి మామిడి పండ్ల సీజన్ మొత్తం ఏదో ఒక వెరైటీని తయారు చేసి టేస్ట్ చేయడం అంటే మహా ఇష్టం. మరి మన రాష్ట్ర వంటలే కాకుండా మామిడితో పక్క రాష్ట్రాల వారు తయారు చేసే వెరైటీ రుచులకు కూడా మనం రుచి చూస్తే ఎంత బాగుంటుంది.

కోవా -క్యారెట్ హల్వా: స్పెషల్ స్వీట్ డిష్

కోవా -క్యారెట్ హల్వా: స్పెషల్ స్వీట్ డిష్

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా క్యారెట్లు కనబడుతున్నాయి. అంటే ఇది క్యారెట్ల సీజన్ అన్నమాట. అయితే సందేహం లేకుండా వీటిని మీ రెగ్యులర్ హెల్తీ డైట్ లో చేర్చుకోవాల్సిందే. అది సలాడ్, సైడ్ డిష్ లేదా డిజర్ట్ రూపంలో తీసుకోవల్సిన హెల్తీ వెజిటేబుల్ క్యారెట్. దీన్ని ఖచ్చితంగా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే. క్యారెట్ ఉపయోగించి డిజర్ట్ తయారుచేయాలంటే వెంటనే మన మనస్సులు క్యారెట్ హాల్వానే గుర్తుకు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఒక ఫేవరెట్ సౌత్ ఇండియన్ స్వీట్ డిష్.

సాబుదాన లేదా సగ్గుబియ్యం ఖీర్

సాబుదాన లేదా సగ్గుబియ్యం ఖీర్

శ్రీరామనవమి స్పెషల్

సగ్గు బియ్యం అనగానే పాయసం. పాయసం అనగానే సగ్గుబియ్యం గుర్తుకొస్తాయి కదూ! అయితే ఈ తినే తెల్లని ముత్యాలంటే చాలా ఇష్టం. వీటినే ఆంగ్లంలో 'సాగో' అని హిందీలో 'సాబుదానా' అని అంటారు. మన భారతదేశంలో పండుగలకు చేసే పొంగలిలో, పాయసంలో వీటిని తప్పకుండా వాడటం తప్పనిసరి. వీటిని ఉపయోగించి పాయసమే కాకుండా రకరకాల పిండివంటలు తయారుచేస్తారు. అందరూ ప్రధానంగా పిల్లలు ఎంతో ఇష్టంగా సగ్గుబియ్యంతో తయారుచేసిన వంటలు తింటారు.

కోవా మాల్పువా

కోవా మాల్పువా

మాల్పువా ఒక ట్రెడిషినల్ ఇండియన్ స్వీట్ రిసిపి, ఇది సాధారణంగా ఫ్రై చేసిన పాన్ కేక్. ఈ పాన్ కేక్ ను షుగర్ సిరప్ లో వేసి డిప్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా పండుగ వేళల్లో తయారుచేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పాటు, బందువులు, స్నేహితులను ఆనంద పరచాలంటే ఈ స్పెషల్ జైపుర్ కోవా మాల్పువా తయారుచేయాల్సిందే..

English summary

Top 10 Sweet Recipes For Ram Navami

Ram Navami is the birthday celebration of Lord Ram. This celebration takes place on the ninth and last day of Chaitra Navratri. People celebrate the birth of Lord Ram by fasting throughout the day, singing hymns and then feasting after sunset.
Story first published: Tuesday, April 8, 2014, 15:48 [IST]
Desktop Bottom Promotion