For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్ది వడ సౌత్ ఇండియన్ స్పెషల్ సైడ్ డిష్

|

ఉద్దిన వడ సౌత్ ఇండియన్ స్పెషల్ డిష్. మరీ ముఖ్యంగా ఇడ్లీకి సైడ్ డిష్ గా చేస్తుంటారు. తింటుంటారు. ఇది చాలా సాధారణమైనటువంటి బ్రేక్ ఫాస్ట్ . ఇది సౌత్ ఇండియాలోనే కాక మొత్తం ఇండియాలోనే ఇడ్లీ, వడా చాలా ఫేమస్. ఉద్ది వడకు బ్లాక్ గ్రామ్ (ఉద్దిపప్పు)ను ఉపయోగిస్తారు.

ఉద్దివడ తయారు చేయడం చాలా సులభం. వస్తువులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఉద్దివడ టైమ్ సేవ్ చేయడమే కాదు, చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఈ ఉద్దివడలు ఆకలి తీర్చుతుంది. క్రిస్పీగా ఉండే ఈ వడ, ఇండ్లీ, సాంబార్ కాంబినేషన్. రెండు చాలా మంచి రుతితో ఉదయం అల్ఫాహారం తీసుకోవడం వల్ల కడుపు నిండటమే కాదు, ఆరోగ్యానికి మంచిది కూడా. మరి ఉద్ది వడ ఎలా తయారు చేయాలో చూద్దామా...

Uddina Vada- South Indian Recipe

కావల్సిన పదార్థాలు:
ఉద్దిపప్పు: 1 cup
పెప్పర్: 2tsp
అల్లం: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి: 3
నూనె: 2tbsp
ఉప్పు: ½ tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఉద్దిపప్పును రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టాలి.
2. తర్వాత బ్లాక్ పెప్పర్ ను మిక్సీలో వేసి కచపచ గ్రైండ్ చేసుకోవాలి.
3. పచ్చిమిర్చి మరియు అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఉద్దిపప్పులోని నీరు వంపేసి మళ్ళీ నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా, పేస్ట్ చేసుకోవాలి.
5. అందులోనే అల్లం, పచ్చిమర్చి, ఉప్పు వేసి అన్నింటిని బాగా మిక్స్ చేయాలి.
6. తర్వాత స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి, అందులో నూనె వేసి మీడియం మంట మీద బాగా కాగనివ్వాలి. తర్వాత ఉద్దిపప్పు పేస్ట్ మిశ్రమాన్ని ఓ ప్లాస్టిక్ కవర్ మీద వడలా వత్తుకొని నూనెలోకి జారవిడచాలి. అంతే గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి రాగా తీసి సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి.
7. అంతే వేడి వేడి ఉద్దివడలు తినడానికి రెడీ. ఒక కప్పు వేడి వేడి కాఫీతో, కొబ్బరి చట్నీతో తినాలి.

English summary

Uddina Vada- South Indian Recipe | ఉద్ది వడ సౌత్ ఇండియన్ స్పెషల్ డిష్

Uddina Vada is an authentic and traditional South Indian recipe which usually acts like a side dish to the idli. It is one of the most common South Indian breakfast and is equally popular not just in South India but all over India. Uddina, meaning black gram flour is a common used dal or flour.
Story first published: Tuesday, February 5, 2013, 11:30 [IST]
Desktop Bottom Promotion