
కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: 6
మైదా: 2cups
పంచదార: 3cups
కోకో పౌడర్: 50grsm
పాలు: 1/2tsp
బటర్: 1/2cup
వెనీల ఎస్సెన్స్: 1tsp
బేకింగ్ పౌడర్: 1tsp
నీళ్ళు: 1/2cup
ఈస్ట్: 1/2cup
ఉప్పు: చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా బటర్, పంచదార బాగా కలిసేలా కలబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోనే కోడిగుడ్లను కూడా పగలగొట్టి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత మైదా, ఉప్పు , బేకింగ్ పౌడర్ , కోకో పౌడర్ కలిపి ఈ మిశ్రమాన్నంతా బాగా మిక్స్ అయ్యేలా గిలకొట్టాలి.
3. ఇప్పుడు పాలు , వెనిల ఎస్సెన్స్, నీళ్ళు పోసి మరోసారి బాగా కలబెట్టాలి. ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసి రెడిగా పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి రాసి, మైదా తో గ్రీస్ చేసి పైన తయారు చేసి పెట్టుకొన్నకేక్ మిక్స్ అందులో వేసి ఒవెన్ లో బేక్ చేసుకోవాలి. అంతే మనకి నచ్చిన విధంగా చాక్లెట్ సిరప్ తో లేదా ఐసింగ్ సుగర్ తో గార్నిష్ చేయాలి అంతే చాక్లెట్ కేక్ రెడీ....













