For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ హాల్వా-నవరాత్రి స్పెషల్ స్వీట్

|

దేవీ నవరాత్రులు ఆల్రెడీ మొదలయ్యాయి. దేవీ నవరాత్రులు..ఈ తొమ్మిది రోజులూ, ఇండియాలో ఒక్కో రోజును ఒక్కో విధంగా పూజిస్తారు. ఈ పండుగ సందర్భంలో తొమ్మిది రోజూలు అత్యంత పవిత్రంగా ఉపవాసదీక్షలు చేయడం ఆచారం. ఈ సమయంలో ఉపవాసాలుండే వారు ఒక కఠినమైన నిబంధనలను అనుసరిస్తారు. పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు చేస్తారు. అలాగే కొంత మంది అల్పాహారాలను తీసుకొనేవారూ ఉన్నారు.

అల్పాహరం అంటే రెగ్యులర్ గా తయారు చేసేవి కాకుండా కొంచెం డిఫరెంట్, బుక్వీట్, రాక్ సాల్ట్, జీడిపప్పు పౌడర్ వంటి వాటితో తయారు చేసి వంటలు కూడా ఉన్నాయి. వీటితో తయారుచేసే వంటలను ఉపవాసం ఉన్నవారు తీసుకోవచ్చు. మరి అటువంటి వారికోసం ఇక్కడ ఒక స్పెషల్ స్వీట్ ను ఎలా తయారుచేయాలో ఇవ్వడం జరిగింది. దీన్ని తయారుచేసి ఉపవాసం ఉన్నవారు లేని వారు కూడా ఈ స్వీట్ తిని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ నవరాత్రి స్పెషల్ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

Vrat Ka Halwa: Navratri Sweet Recipe

జీడిపప్పు పౌడర్ : 1/2cup
కుట్టు కా అట్టా (బుక్వీట్ పిండి): ½cup
నెయ్యి: 3tbsp
నీటి: 2cups
చక్కెర: ½
యాలకులు: 3(పౌడర్ చేసుకోవాలి)
బాదాం: 6 (ముక్కలుగా చేయాలి)
పిస్తాలు: 6 (ముక్కలుగా చేయాలి)

తయారుచేయు విధానం:
1. పాన్ లో నెయ్యి వేసి అందులో జీడిపప్పు పౌడర్ మరియు బుక్వీట్ పిండి వేసి, మీడియం మంట మీదు 5నిముషాలు వేగించుకోవాలి. ఈ పిండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. ఈ పిండిని తీసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి చల్లారి తర్వాత అందులో నిదానంగా కొద్దిగా నీళ్ళు కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి.
3. ఉండలు లేకుండా ఈ పిండిని చాలా మ్రుదువుగా కలుపుకోవాలి.
4. ఇప్పుడు అందులో పంచదార వేసి, బాగా ఉడికించాలి. మద్య మద్యలో కలుపుతూ ఉండాలి.
5. పిండి మిశ్రమం చిక్కబడుతూ, హాల్వాల దగ్గరగా అవుతున్నప్పుడు, అందులో బాదం, పిస్తా, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
6. ఇవన్నీ వేసిన తర్వాత కూడా, హల్వా దగ్గరపడే వరకూ మరికొంత గట్టిగా తయారయ్యే వరకూ ఉడికించుకోవాలి.
7. హల్వా పూర్తిగా దగ్గరపడి మృదువుగా తయారయ్యాక స్టౌ ఆఫ్ చేసి, సర్వ్ చేయాలి.

English summary

Vrat Ka Halwa: Navratri Sweet Recipe

With the festival of Navratri at its peak, everyday is a celebration all over India. The most crucial part of the festival is the custom of fasting for the nine auspicious days. During this time the people who fast follow some strict rules about the type of food they eat.
Story first published: Wednesday, October 9, 2013, 13:29 [IST]
Desktop Bottom Promotion