For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెడ్ ఛాట్ రిసిపి: వీకెండ్ స్పెషల్

|

ముఖ్యంగా ఈవెనింగ్ స్నాక్స్ లో వివిధ రకాలు ఉన్నాయి. స్వీట్స్ మరియు స్పైసీ స్నాక్స్ ఉన్నాయి. అవేకాకుండా, బ్రెడ్ తో తయారుచేసే స్నాక్స్ కూడా చాలా ఫేమస్. ఇవి రుచికరంగా మంచి ఫ్లేవర్ తో నోరూరిస్తూ మ్యాజిక్ చేస్తుంటాయి. అటువంటి స్నాక్స్ మీరు కూడా తినాలనుకుంటే ఇటువంటి సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రిసిపిని ప్రయత్నించవచ్చు.

వర్షకాలం ప్రారంభమైనది. నగరంలో స్పైసీగా స్ట్రీట్ ఛాట్స్ మరియు పకోడాలతో ఘుమఘమలాడుతూ నోరూరిస్తుంటాయి . అంతే అనారోగ్యరంగా స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం కంటే, ఆరోగ్యకరంగా కొంచెం సమయం వెచ్చించి ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ సింపుల్ అండ్ ఈజీ బ్రెడ్ ఛాట్ స్నాక్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Weekend Special: Bread Chaat Recipe

కావల్సిన పదార్థాలు:
బ్రెడ్ స్లైస్- 5 (టోస్ట్ చేసినవి)
చిక్కటి పెరుగు:
ఉప్పు: రుచికి సరిపడా
దేశీ నెయ్యి: 1tsp
మిరప పొడి : ¼ tsp
పచ్చిమిర్చి: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
జీలకర్ర పొడి: 1tsp
ధనియా పొడి: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
కొత్తిమీర: 2tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి )
పుదీనా ఆకులు - 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1 మీడియం సైజ్ (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1 మీడియం సైజ్ (చిన్న ముక్కలుగా కటం యుపె్ొవాలి)
సేవ్ మరియు వేరుశెనగలు: గార్నిష్ కోసం

తయారుచేయు విధానం:
1. ముందుగా బ్రెడ్ ను టోస్ట్ చేయడానికి ముందు వాటిని కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ మీద కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక బ్రెడ్ స్లైస్ ను టోస్ట్ చేసుకోవాలి.
3. తర్వాత ఒక టిష్యు పేపర్ మీద వీటిని పెట్టడం వల్ల అదనపు నెయ్యి లేదా నూనె తొలగిపోతుంది.
4. తర్వాత వెంటనే వాటిని ఒక ప్లేట్ లో సర్ధి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టోస్టో చేసిన బ్రెడ్ స్లై మీద ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి, పుదీనా మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.
5. ఇప్పుడు ఉప్పు, కారం, ఛాట్ మసాలా, ధనియా పౌడర్ మరియు జీలకర్ర పొడిని చిలకరించాలి.
6. తర్వాత టీ స్పూన్ తో పెరుగును వాటిమీద నిధానంగా వేసి సర్ధాలి. పెరుగును బ్రెడ్ మొత్తం పరవాలి.
7. చివరగా సేవ్ మరియు వేరుశెనగలతో గార్నిష్ చేయాలి. తయారుచేసిన వెంటనే ఫ్రెష్ గా సర్వ్ చేయాలి. అంతే నోరూరించే స్నాక్ రిసిపి రెడీ...

English summary

Weekend Special: Bread Chaat Recipe

Here we spend many a evening eating our favourite chaat, relishing its magical, addictive flavours. And why not? It is a comforting food that warms the palate. ADVERTISEMENT As monsoon is hitting various parts of the country, having spicy street chaats and pakoras become difficult.
Story first published: Friday, October 31, 2014, 16:03 [IST]
Desktop Bottom Promotion