For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాల్చిన చెక్క-అల్లం టీ ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది

|

మొత్తానికి దాల్చిన చెక్క మరియు అల్లం టీ మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం మీరు ఒక ఆరోగ్యకరమైన టీ తీసుకోవాలనుకుంటుంటే, రుచితో పాటు ఆరోగ్యకరంగా ఉపయోగపడే టీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అటువంటి టీలలో దాల్చిన చెక్క, అల్లం టీని ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది రుచిగా మాత్రమే కాదు బరువు తగ్గించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

దాల్చిన చెక్క అల్లం టీ చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు మరియు ఖచ్చితంగా ఆరోగ్యకరం. టీ హార్ట్ హెల్తీ బెవరేజ్. ఇది హార్ట్ డిసీజెస్ కు వ్యతిరేకంగా పోరాడీ, గుండెను సురక్షితంగా ఉంచుతుంది. మరి అయితే మీరు ఎటువంటి టీ తీసుకుంటున్నారు? దాల్చిన చెక్కతో తయారుచేసే టీ చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. మీరు కూడా ఒక సారి ప్రయత్నించి చూడండి

Cinnamon Ginger Tea Recipe For Weight Loss

కావల్సిన పదార్థాలు:

దాల్చిన చెక్: 2inches
అల్లం: 1/2inch(తురుముకోవాలి)
బ్లాక్ టీ ఆకులు: 1tsp
నిమ్మకాయ: 2స్లైడ్స్
పుదీనా ఆకులు: 5-6

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. తర్వాత అందులో దాల్చిన చెక్క పొడి చేసుకోని వేయచ్చు లేదా అలాగే కూడా వేసి బాగా మరిగించాలి.
2. 5 నిముషాలు బాగా ఉడికిన తర్వాత అందులో అల్లం తురుము వేసి మరో రెడు నిముషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
3. తర్వాత టీ ఆకులు వేసి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
4. ఈ టీ ఆకులు 3, 4 నిముషాుల ఆ నీటిలో నానివ్వాలి. మూత పెట్టి ఆవిరిలోనే నాననివ్వాలి.
5. తర్వాత ఈ లిక్విడ్ ను రెండు కప్పుల్లో పోసి నిమ్మకాయన్ సగంగా కట్ చేసి రెండు కప్పలు వద్ద ఉంచి, పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఈ దాల్చిన చెక్క అల్లం టీని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల మీ శరీరంలో మలినాలను తొలగిస్తుంది.

English summary

Cinnamon Ginger Tea Recipe For Weight Loss

Tea is one of the healthiest beverages for many different reasons. First of all, tea has antioxidants that helps fight cancer. Tea is also known to a heart healthy beverage that protects you against heart diseases.
Story first published: Wednesday, June 11, 2014, 12:36 [IST]
Desktop Bottom Promotion