For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ ఓట్స్ సూప్ రిసిపి : వింటర్ స్పెషల్

|

ఓట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఓట్స్ తో సూప్ తయారుచేయడం అనేది ఒక బెస్ట్ ఐడియా. ఓట్స్ సూప్ రిసిపి చాలా సులభంగా పది నిముషాల్లో తయారుచేసేయవచ్చు.

చలికాలంలో హాట్ అండ్ స్పైసీగా త్రాగాలంటే ఈ ఓట్స్ సూప్ రిసిపి ఒక ఉత్తమ ఎంపిక. ఓట్స్ ను సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. అయితే చలికాలంలో ఈవెనింగ్ టైల్ లో కూడా ఏదైనా హెల్తీగా స్పైసీగా తీసుకోవాలనుకొన్నప్పుడు ఇది ఒక ఉత్తమ ఎంపిక మరి ఈ హాట్ అండ్ స్పైసీ ఓట్స్ సూప్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Healthy Oats Soup Recipe

కావల్సిన పదార్థాలు:
ఓట్స్: 2tbsp
పాలు: 1cup
ఉల్లిపాయలు: 1/4cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
పెప్పర్: కొద్దిగా
నూనె: కొద్దిగా
కొత్తిమీర తరుగు కొద్దిగా

తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. అంతలోపు వేరుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసి ఉడికించుకోవాలి. చిక్కగా ఉడికిన తర్వాత అందులో పాలు మిక్స్ చేయాలి. 5నిముషాలు ఉడికించాలి.
3. ఇప్పుడు, అందులో రోస్ట్ చేసుకొన్న ఉల్లిపాయ ముక్కలు మరియు వెల్లుల్లి ముక్కలు, ఉప్పు మరియు పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
4. చివరగా కొత్తిమీర తరుగుతో ఓట్స్ సూప్ ను గార్నిష్ చేయాలి. అంతే ఓట్స్ సూప్ రెడీ .
ఈ స్పైసీ ఓట్స్ సూప్ ను వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. చలికాలంలో మరింత స్పైసీగా ఉండాలంటో ఒకటి రెండు పచ్చిమిర్చిని జోడిచవచ్చు.

English summary

Healthy Oats Soup Recipe

Oat is a healthy food. Soup made from oats is an ideal drink to end your day. Recipe for oats soup is simple, and it will not take you more than 10 minutes to prepare this drink.
Story first published: Wednesday, November 19, 2014, 18:15 [IST]
Desktop Bottom Promotion