For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా మార్నింగ్ డ్రింక్స్

|

సంవత్సరంలో మొత్తం వేసవి కాలం చాలా ఆహ్లదకరమైనది. ఎందుకంటే మనం మన దినచర్యను మనకు నచ్చిన స్మూతీస్ లేదా డ్రింక్స్ తో ప్రారంభించే అవకాశం ఈ వేసవి సీజన్ యొక్క ప్రత్యేకత.

అలాగే మనలో చాలా మంది ఉదయాన్నే కాఫీ త్రాగడానికి ఇష్టపడుతారు, వేసవికాలంలో వాతావరనంలోని వేడిని తట్టుకోవాలంటే కాఫీకి బదులుగా ఛాయ్ (టీ)ని త్రాగడం మంచిది.

అలాగే ఈ వేసవికాలంలోబ్రైట్ మార్నింగ్ మనం తీసుకోవడానికి మనకు ఇష్టమైన కూల్ డ్రింక్స్ చాలానే ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినం . ఈ వరల్డ్ హెల్త్ డే న కొన్ని రకాల స్మూతింగ్ డ్రింక్స్ లో ముఖ్యంగా కాఫీనేటెడ్ డ్రింక్స్ కు ప్రత్యామ్నాయంగా ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవాలి.

ఈ మార్నింగ్ జ్యూసులు మరియు డ్రింక్స్ శరీరంలోని నరాలను ప్రశాంత పరుస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది, మరియు శరీరంను చల్లబరుస్తాయి . రోజంతా ఉత్సహాంగా మరియు ఉల్లాసంగా ఉంచుతాయి. మరి వేసవి సీజన్ యమ్మీ అండ్ స్మూతింగ్ డ్రింక్స్ తో మీ దినచర్యను ప్రారంభించండి. వేసవికాలాన్ని స్మూత్ గా కూల్ గా ఆస్వాదించండి...

మరి సమ్మర్ మార్నింగ్ లో తీసుకోగలిగే కొన్ని పానియాలు మీకోసం:

1. మసాలా టీ:

1. మసాలా టీ:

మసాల టీ ఒక కప్పు కాఫీ కంటే మసాల టీ త్రాగడం మంచిది . అందులో యాలకలు మరియు దాల్చిన చెక్క వేస్తే మరింత టేస్టీగా ఉంటుంది.

2. లెమన్ జ్యూస్:

2. లెమన్ జ్యూస్:

హాట్ సమ్మర్ లో కూల్ గా లెమన్ జ్యూస్ త్రాగడం మంచిది . ఒక గ్లాసు వాటర్ లో నిమ్మరసాన్ని పిండి అందులో తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. వేసవిలో బాడీ హీట్ ను తగ్గించడానికి లెమన్ జ్యూస్ చాలా ఉత్తమం.

3. గ్రీన్ టీ:

3. గ్రీన్ టీ:

గ్రీన్ టీ మరో స్మూత్ డ్రింక్. దీన్ని కాళీ పొట్టతో ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి. ఇది బరువు కూడా తగ్గిస్తుంది.

4. ఆరెంజ్ జ్యూస్:

4. ఆరెంజ్ జ్యూస్:

ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. తొక్కను తీసి జ్యూసర్ లో వేసి జ్యూస్ తీసి అందులో కొద్దిగా పంచదార మరియు తేనె మిక్స్ చేసి తీసుకుంటే ఇది పొట్టను చల్లగా ఉంచుతుంది మరియు వేడి వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది.

5. కొబ్బరి బోండాం:

5. కొబ్బరి బోండాం:

తాజా కోకనట్ వాటర్ కంటే మరే హెల్తీ డ్రింక్ ఉండదంటే అతిశయోక్తి కాదు . వేసవికాలంలో ఈ హెల్తీ డ్రింక్ వ్యాధి నిరోధకత పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

6. బెర్రీ జ్యూస్:

6. బెర్రీ జ్యూస్:

గుప్పెడు బెర్రీలను జ్యూసర్ లో వేసి జ్యూస్ చేసి, అందులో కొద్దిగా పాలు మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల సమ్మర్ హీట్ ను ఎదుర్కోవడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

7. కుకుంబర్ జ్యూస్:

7. కుకుంబర్ జ్యూస్:

మీకు నచ్చిన వారికోసం ఆరోగ్యకరమైన డ్రింక్ ను అందివ్వడంలో ఇది ఒక హెల్తీ డ్రింక్. దీనికి కొద్దిగా ఒక చెంచా తేనె మిక్స్ చేసి, అలాగే చిటికెడు ఉప్పు మిక్స్ చేసి అందివ్వాలి.

8. పుదీనా జ్యూస్:

8. పుదీనా జ్యూస్:

పుదీనా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. కాబట్టి, వేసవికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి. రెండు చెంచాల నిమ్మరసంలో గుప్పెడు పుదీనా ఆకులు ఒక చెంచా తేనె మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ చేసి కూల్ స్మూతీలా అందివ్వాలి.

9. రోజ్ జ్యూస్ :

9. రోజ్ జ్యూస్ :

వేసవికాలంలో ఉదయం సమయంలో కొంచెం స్వీట్ గా ఆరంభం కావాలంటే అందులో ఒకటి రోజ్ జ్యూస్. ఫ్రెష్ రోజ్ వాటర్ మరియు రోజ్ మిల్క్ ఒక బెటర్ ఆప్షన్ .

10. వాటర్ జ్యూస్ :

10. వాటర్ జ్యూస్ :

ఈ వాటర్ మెలోన్ జ్యూస్ ను వేసవిలో పిల్లలు మరియు పెద్దలతో పాటు అందరూ తీసుకోవచ్చు. నాలుగు పీసుల వాటర్ మెలోన్ ముక్కలుగా చేసి జ్యూస్ చేసి విత్తనాలు తొలగించి తీసుకోవాలి.

11. క్యారెట్ జ్యూస్:

11. క్యారెట్ జ్యూస్:

క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది . ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ కు ఒక చెంచా పంచదార కూడా జోడించి తీసుకోవాలి . కొద్దిగా పుదీనా వేస్తే కూల్ టేస్ట్ ను అందిస్తుంది.

12. గోవ జ్యూస్ :

12. గోవ జ్యూస్ :

జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అందువల్ల దీన్ని వేసవికాలంలో తీసుకోవడం మంచిది. తయారుచేసేప్పుడు అందులోని విత్తనాలన్నీ తొలగించాలి.

13.టమోటో జ్యూస్:

13.టమోటో జ్యూస్:

టమోటో జ్యూస్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉన్నది . ఇది తక్షణం ఎనర్జీని అందిస్తుంది. స్కిన్ కాంప్లెక్స్ ను పెంచుతుంది. బాగా పండిన టమోటోలను జ్యూస్ గా చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి, అందులో కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి తీసుకోవాలి.

English summary

13 Soothing Drinks For A Summer Morning

Summer is the best time of the year to start your day with a soothing drink. These morning juices and drinks will help to calm your nerves, remove stress, cool your body and most of all allow you to have a nice day.
Story first published: Tuesday, April 7, 2015, 17:01 [IST]
Desktop Bottom Promotion