For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఘుమఘుమలాడే చికెన్ స్వీట్ కార్న్ సూప్ : హెల్తీ అండ్ టేస్టీ

|

సాధారణంగా వర్షాకాలమో, శీతాకాలమో వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మందికి. ఎముకలు కొరికే చల్లగాలిలో బద్దకం. వంటగదిలోకి వెళ్ళడానికి మనసు మారాం చేస్తుంది. చలిగాలికి, వర్షానికి గొంతులోకి కాస్త వేడి వేడిగా టీనో, కాఫీనో... కానీ ఎప్పుడూ అవేనా? సూప్ లు ఉన్నాయి కదా.. ఒక పట్టు పట్టవచ్చు కదా....

వింటర్ సీజన్ ఎంజాయ్ చేయాలంటే వేడి వేడి సూప్ త్రాగండి..

ఉప్పు, కారం, ఒకటి రెండు కూరగాయలు కలిపి మరిగించి స్పూన్ తో నోటికి అందుకుంటే ఆకలి అందుకుంటుంది. బద్దకం పారిపోతుంది. మూడ్ హుషారవుతుంది. ఇంట్లో ఉత్సాహం అడుగు మోపుతుంది. కూరగాయలతోనే కాకుండా మాంసాహారంతో తయారు చేసే సూప్ లు కూడా చాలా రుచిగా ఉంటాయి. చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఆరోగ్యంతో పాటు రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. కమ్మనైన రుచి ఘుభాళించే సువాసనతో చికెన్ స్వీట్ కార్న్ సూప్ మాంసాహార ప్రియులు రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. తయారు చేయడం కూడా సులభమే. అనారోగ్య కారణంతో నోటికి రుచి తెలియనప్పుడు ఇటువంటి సూప్ లను తయారు చేసుకొని తాగవచ్చు.....

Chicken Sweet Corn Soup Recipe: Healthy and Tasty Plus Winter Special

కావల్సినన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్ - 100 grams
క్యారెట్స్ - 1/2 cup
క్యాబేజ్ - 1/2 cup
స్వీట్ కార్న్ కార్నెల్స్ - 2 cups
పెప్పర్ పౌడర్ - 1 teaspoon
చిల్లీ పౌడర్ - 1/2 teaspoon
కార్న్ ఫ్లోర్ - 1 tablespoon
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

చికెన్ మష్రుమ్ సూప్

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోయాలి. తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ వేసి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి.
2. ఒక నిముషం తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేయాలి. వేడి అయిన తర్వాత అందులో స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాబేజ్ మరియు క్యారెట్ ముక్కలు వేయాలి.
4. తర్వాత 2లీటర్ల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
5. ఇప్పుడు వాటికి పెప్పర్ పౌడర్ మరియు చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేయాలి.
6. తర్వాత అందులోనే చికెన్ కూడా వేసి మిక్స్ చేయాలి.
7. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నీరు మరియు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
8. ఈ మిశ్రమాన్ని పాన్ లో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలగలుపుకోవాలి.
9. ఈ మొత్తం మిశ్రమం అంతా 10-15నిముసాలు మెత్తగా ఉడకనివ్వాలి. అంతే హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ. మరి ఈ హెల్తీ రిసిపిని మీరు కూడా ఎందుకు ట్రై చేయకూడదు.

English summary

Chicken Sweet Corn Soup Recipe: Healthy and Tasty Plus Winter Special

Sweet corn is rich in carbohydrates and fibre. It is one of the best snacks to have at any part of the day. The chicken sweet corn soup can be served as a breakfast or as an evening snack.
Story first published: Thursday, January 7, 2016, 16:22 [IST]
Desktop Bottom Promotion