దీపావళి స్పెషల్: రోస్టెడ్ క్యాప్సికం సూప్ రిసిపి

Subscribe to Boldsky

దీపావళి విందు భోజనం చేసే ముందు రుచి కరమైన అపటైజర్ ఉంటే బాగుంటుంది కదా.సూప్స్‌ని మించిన అపటైజర్లు ఏముంటాయి??దీపావళి రోజున మీరు చెయ్యాల్సిన పనులెన్నో ఉంటాయి.ఆ పనుల్లో పడి మీరు అలసిపోతారు కదా. నీటి శాతం అధికంగా ఉన్న సూప్స్ తీసుకుంటే మీ శరీరానికి నూతనోత్తేజం వస్తుంది.

అందుకే ఈ రోజు మేము రోస్టెడ్ క్యాప్సికం సూప్ తయారీ ఇస్తున్నాము.దీనిని ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చని క్యాప్సికంతో చేసుకోవచ్చు. మనం తీసుకున్న క్యాప్సికమ్ని బట్టి ఈ సూప్ యొక్క సువాసన, రుచీ ఆధారపడి ఉంటాయి. ఇక ఈ సూప్ తయారీకి కావాల్సిన పదార్ధాలేమిటో, ఎలా తయారు చెయ్యాలో చూద్దామా..

సామాగ్రి సమకూర్చుకోవడానికి-10 నిమిషాలు

తయారీ సమయం-30 నిమిషాలు

ఎంత మందికి సరిపోతుంది-4

కావాల్సిన పదార్ధాలు:

 • ఎర్రని క్యాప్సికం-22
 • ఆయిల్-ఒక టేబుల్ స్పూన్
 • టమాటాలు-4
 • వెల్లుల్లి-ఒక రెమ్మ
 • బిర్యానీ ఆకులు-2
 • నీళ్ళు-3 కప్పులు
 • వెన్న తక్కువ ఉన్న పాలు-అర కప్పు
 • కార్న్ ఫ్లోర్-ఒకటిన్నర టేబుల్ స్పూన్
 • ఉప్పు-తగినంత
 • పంచదార-చిటికెడు
 • నల్ల మిరియాలపొడి-గార్నిషింగ్ కోసం తగినంత

తయారీ విధానం:

1. తాజా ఎర్రని క్యాప్సికం తీసుకుని దానికి నలువైపులా నూనె రాసి స్టవ్ మీద బయట నల్లగా అయ్యేవరకూ కాల్చాలి.

Roasted Capsicum Soup For Diwali

2.ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని కాల్చిన క్యాప్సికం అందులో వేసి చల్లారాకా చేత్తో నల్లని భాగాన్ని తొలగించాలి

Roasted Capsicum Soup For Diwali

3.ఇలా కాల్చుకున్న అన్ని క్యాప్సికంల నుండీ నల్లని భాగాన్ని తొలగించాకా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మరీ చిన్నగా అక్కర్లేదు ఎందుకంటే దీనిని మళ్ళీ మిక్సీలో వేస్తాము కదా.తరిగేటప్పుడు గింజలు తొలగించడం మర్చిపోవద్దు.

Roasted Capsicum Soup For Diwali

4.ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేసి అందులో తరిగిన టమాటా ముక్కలు, మీకు వాసన నచ్చేటట్లయితే ఒక వెల్లుల్లి రెమ్మ కూడా వెయ్యాలి.

Roasted Capsicum Soup For Diwali

5. ఇప్పుడు టమాటాలలో మంచి సువాసన కోసం బిర్యానీ ఆకు, తరిగిన క్యాప్సికం ముక్కలు, నీళ్ళు వేసి ఉడికాకా స్టవ్ కట్టెయ్యాలి.

Roasted Capsicum Soup For Diwali

6.ఈ మిశ్రమం చల్లారాకా మిక్సీలో వేసి గ్రైండ్ చెయ్యాలి. ఎప్పుడూ కూడా మిక్సీ పైవరకూ వేసి గ్రైండ్ చెయ్యకూడదు. ఒక వేళ మిశ్రమం మరీ ఎక్కువ ఉంటే రెండు సార్లు గ్రైండ్ చేసుకోవాలి.

Roasted Capsicum Soup For Diwali

7.గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి వేడెక్కాకా దానిలో ఈ మిశ్రమాన్ని వెయ్యాలి. ఇప్పుడు పాలల్లో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి దానిని సూప్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి సూప్ రుచి చూసి పుల్లగా ఉందనుకుంటే చిటికెడు పంచదార కలపాలి.

Roasted Capsicum Soup For Diwali

8.సూప్ చిక్కబడగానే స్టవ్ కట్టేసి సూపుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన మిరియాల పొడి చల్లి సర్వ్ చెయ్యడమే.

ఈ దీపావళికి ఈ సూప్ ప్రయత్నించి మీ ఇంట్లోవాళ్ళేమన్నారో మాకు కామెంట్ల ద్వారా తెలియచెయ్యడం మర్చిపోవద్దు సుమా.

English summary

Roasted Capsicum Soup For Diwali

Before starting a full-fledged Diwali meal, why not have some appetizing delicacy? And there is nothing better than soups for that. On Diwali, you have lots of things to do, isn't it? It is quite obvious that you can get exhausted. Having soups can keep the water balance intact in your body and you won’t feel a lack of energy too.
Please Wait while comments are loading...
Subscribe Newsletter