For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరి పాల పూరీలు: దీపావళి స్పెషల్

|

హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే దీపావళి పండుగ. దీపావళి వచ్చేస్తుంది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో.. ఇంటినిండా బంధువులు, స్నేహితులతో సందడిగా జరుపుకొనే పండుగ దీపావళి. పిల్లలు, పెద్దలతో సహా అంతా సరదాపడే పండుగ కూడా దీపావళే. దీపావళి ప్రత్యేకం దీపాలంకరణ అయితే, పిల్లలంతా టపాసులు కాల్చాక అమ్మ చేతి తీపి వంటకాలు ఆనందంగా ఆరగించడం.

దీపావళి స్పెషల్‌ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్‌తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్‌ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్‌ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు. అటువంటి స్వీట్‌ డిష్‌లో పిల్లలకెంతో ప్రీతికరమైన స్వీట్ కోకోనట్ సేమియా పాయసం మరి దీన్నిఎలా తయారుచేయాలో చూద్దాం...

Coconut Pala Purilu: Diwali Special Sweet

కావలసిన పదార్థాలు :
పాలు: 1/2ltr
పంచదార: 250grm
కొబ్బరి పాలు: 1/2ltr(కొబ్బరి తురుముని మిక్సీలో వేసి చిక్కగా పాలు తీసుకోవాలి)
యాలకుల పొడి: 1tsp
మైదా: 250grm
గోధుమపిండి: 250grm
ఉప్పు: 1/2tsp
గసగసాలు: 25grm
నూనె: కావలసినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా మైదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కాచిన పాలలో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి(నూనె వేయకుండా వేయించి పొడిచేసి ఉంచుకోవాలి) వేసి పంచదార బాగా కరిగేవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితో పూరీలు చేసి ఎర్రగా వేయించి ఈ పాలలో వేయాలి. ఇవి బాగా నానితే మంచి రుచిగా ఉంటాయి. అంతే పాల పూరీలు రెడి.

English summary

Coconut Pala Purilu: Diwali Special Sweet

Here is a wholesome dessert -which is a meal by itself too! These delicious Badam milk puris or Paal Bolis are traditional desserts which are served along with the meal or as a wholesome meal too!
Story first published: Tuesday, October 21, 2014, 18:29 [IST]
Desktop Bottom Promotion