For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖర్జూరం+ఆపిల్ ఖీర్ రిసిపి: దసరా స్పెషల్

By Super Admin
|

పండుగ సమయాల్లో ఆహారాలు ప్రత్యేక స్థానం. ఎందుకంటే పండగ సమయాల్లో వెరైటీ వంటలతో ఇల్లు ఘుమఘమలాడుతాయి, దసరా, దీపాలి తర్వాత క్రిస్మస్. క్రిస్మస్. వరసగా వస్తున్న ఈ పండుగలకు డిజర్ట్స్ లేకపోతే పండుగలు సంత్రుప్తికరంగా పూర్తి కావు. లడ్డులు, బర్ఫీలు ప్రత్యేంగా వండాల్సిందే...

దుర్గా పూజ, నవరాత్రి స్పెషల్ గా డిజర్ట్స్, ఎక్స్ పిరిమెంటల్ డిషెస్, తయారుచేసుకోవడం వల్ల పండుగ ఉత్సహాయం మరింత ఎక్కువగా ఉంటుంది

దుర్గా పూజకు ఎక్కువగా స్వీట్స్ ను తయారుచేస్తుంటారు. అలాంటి స్ఫెషల్ డిష్ లలో డేట్స్ యాపిల్ ఖీర్ రిసిపి ఒకటి, దీన్ని తయారుచేయడం చాలా సులభం, అంతే కాదు దేవుడుకి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు

డేట్స్ యాపిల్ ఖీర్ డిజర్ట్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

కావల్సినవి:

యాపిల్ - ¾th కప్పు(యాపిల్ తొక్క తొలగించాలి)

పంచదార - 1 tsp

వాటర్ - 1 cup

లోఫ్యాట్ మిల్క్ - 2 cups

కార్న్ ఫ్లోర్ - 2 tsp

డేట్స్ (ఖర్జూరాలు ¼th cup (సన్నగా కట్ చేసుకోవాలి)

పంచదార - 2 tsp

అలంకరణ కోసం

వాల్ నట్స్ - ¼th కప్పు (సన్నగా తరిగినవి)

తయారీ:

1. డీప్ బాటమ్ నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో యాపిల్ , కొద్దిగా నీళ్ళు, పంచదార వేయాలి.

Dates And Apple Kheer Recipe For Durga Puja

2. కొన్ని నిముషాల పాటు ఆపిల్ ముక్కలను ఉడికించుకుని, స్టౌ ఆఫ్ చేయాలి. ఆపిల్ ఉడికించుకోవడానికి అంత సమయం పట్టదు.

Dates And Apple Kheer Recipe For Durga Puja

3.కాబట్టి, 5నుండి 10 నిముషాల లోపు యాపిల్ ను మెత్తగా ఉడికించి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా క్రంచీగా ఉన్నట్లే క్రిందికి దింపుకోవాలి.

Dates And Apple Kheer Recipe For Durga Puja

4. ఇప్పుడు మరో నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా పాలు పోయాలి.

Dates And Apple Kheer Recipe For Durga Puja

5. పాలు కాగిన తర్వాత అందులో నుండి అరకప్పు పాలు పక్కకు తీసి చల్లార్చాలి. తర్వాత అందులో కార్న్ ఫ్లోర్ జోడించి, బాగా మిక్స్ చేయాలి. కార్న్ ఫ్లోర్ బాగా కరిగే వరకూ కలియబెట్టాలి.

Dates And Apple Kheer Recipe For Durga Puja

6. పాలు ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు., నార్మల్ ఖీర్ కు కాచినట్లే పాలు కాచాలి. పాలు ఒకసారి బాయిల్ అవ్వగానే అందులో కార్న్ ఫ్లోర్ ను మిక్స్ చేయాలి. పాలలో ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న డేట్స్ వేసి, మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. తర్వాత స్పూన్ తో డేట్స్ ను స్మాష్ చేయాలి. అలా చేయడం వల్ల డేట్స్ ఆరోమా వాసన పాలలో బాగా మిక్స్ అవుతుంది. దీన్ని 10 నిముషాలు తక్కువ మంట లో ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండటం వల్ల పాన్ అడుగంటకుండా ఉంటుంది.

Dates And Apple Kheer Recipe For Durga Puja

7. ఇప్పుడు స్టౌవ్ ఆఫ్ చేసి, ఖీర్ ను చల్లార నివ్వాలి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుని, యాపిల్స్, షుగర్ ను చేర్చి మొత్తం కలగలిసేలా మిక్స్ చేయాలి.

Dates And Apple Kheer Recipe For Durga Puja

8. తర్వాత అందంగా ఉండే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఖీర్ ను అందులో పోయాలి. దీన్ని వాల్ నట్స్ తో గార్నిష్ చేసి, చల్లచల్లగా సర్వ్ చేస్తే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. అంతే డేట్స్ అండ్ యాపిల్ కీర్ రెడీ...దీన్ని డయాబెటిక్ వారు కూడా హ్యాపిగా తినవచ్చు. నేచురల్ షుగర్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

English summary

Dates And Apple Kheer Recipe For Durga Puja

Foods are the best part of any festival, right? After all, Christmas is so special to all because of cakes and pastries and imagining Diwali without 'Ghee ke Laddu' and 'Barfis' is impossible.
Desktop Bottom Promotion