For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ హోం మేడ్ డ్రై గులాబ్ జామూన్ : గణేష చతుర్థి స్పెషల్ ..

|

శ్రీక్రిష్ణ జన్మాష్టమి తర్వాత హిందువులకు మరో పెద్ద పండగ, వినాయక చవితి. బాద్రపద మాసంలో మొదట వచ్చే పండుగ గణేష చతుర్థి. మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో గణేష్ ఉత్సవాలను చాలా ఉల్లాసంగా...ఉత్సాహంగా జరుపుకుంటారు.

గణేషుడుని ఇంటికి ఆహ్వానించి , ఆయనకు ఇష్టమైన స్వీట్స్ , లడ్డులను తయారుచేసి పెడుతుంటారు. స్వీట్స్ లో గులాబ్ జామూన్ ఒకటి. ఈ గణేష చతుర్థికి స్పెషల్ గా మరీ మార్కెట్లో రెడీ మేడ్ గులాబ్ జాముకు బదులుగా మీరే స్వయంగా తయారుచేసుకోవచ్చు. డ్రై గులాబ్ జామూన్ ను ఇంట్లో తయారుచేయడం చాలా సులభం

ఇంట్లో తయారుచేసుకునే వివిధ రకాల స్వీట్ రిసిపిలలో ఇది చాలా సింపుల్ రిసిపి. అంతే కాదు పిల్లలకు, పెద్దలకు అత్యంత ఇష్టమైనది ఈ గులాబ్ జామూన్. ఈ హోం మేడ్ గులాబ్ జామూన్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబం అంతా సంతోషంగా గడుపుతారు. ఈ టేస్టీ అండ్ యమ్మీ గులాబ్ జామూన్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

Dry Gulab Jamun

కావల్సిన పదార్థాలు:
కోవ: 250 gm
పన్నీర్ - 100 gm
మైదా - 2 teaspoons
మిల్క్ పౌడర్: 1 cup
పాలు: 1 cup
బేకింగ్ సోడ: 1/4 teaspoon
షుగర్: 2 cups
యాలకలు 1 teaspoon
షుగర్ పౌడర్: 1/2 cup
కొబ్బరి పొడి : 1/2 cup

తయారుచేయు విధానం:
1. ముందుగ పిండిని తయారుచేసుకునే విధానం: పెద్ద బౌల్ తీసుకుని అందులో పన్నీర్ తురుము, మైదా, మరియు మిల్క్ పౌడర్ ను తీసుకోవాలి.
2. ఈ పదార్థాలన్నీ నీట్ గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా పాలు పోసి, పిండిని సాప్ట్ గా కలుపుకోవాలి.
3. ఇలా కలుపుకున్న పిండిని 10-15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
4. 15నిముషాల తర్వాత పిండిని నుండి కొద్దిగా తీసుకుని జామ్ ఉండల్లా చిన్న గా చుట్టుకోవాలి.

షుగర్ సిరఫ్ తయారుచేసుకోవడానికి:
1. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2కప్పులు షుగర్ మరియు ఒక కప్పు వాటర్ తీసుకోవాలి.
2. అలాగే దీనికి యాలకలపొడి జోడించాలి. షుగర్ సిరఫ్ చిక్కగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
3. షుగర్ సిరఫ్ రెడీ అయ్యేలోపు, స్టౌమీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి, కాగిన తర్వాత జామూన్ ఉండలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఇలా ఒకదాని తర్వాత పాన్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.
5. తర్వాత 5 నిముషాల తర్వాత వీటిని షుగర్ సిరఫ్ లో వేసుకోవాలి.
6. జామూన్స్ షుగర్ సరిఫ్ లో బాగా నాని, సాప్ట్ గా తయారయ్యే వరకూ అందులోనే ఉంచాలి.
7. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో పంచదార మరియు కొబ్బరి తురుము వేసి మిక్స్ చేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి.
8. ఒక గంట తర్వాత షుగర్ సిరఫ్ లోని జామూన్స్ను బటయకు తీసి, పంచదార కొబ్బరి పొడిలో వేసి అన్ని వైపులా రోల్ చేయాలి.
9. ఇప్పుడు ఈ జామూన్స్ ను ఫ్రిజ్ లో పెట్టి రెండు గంటల సేపు అలాగే ఉంచుకోవాలి.
10. రెండు గంటల తర్వాత బయటకు తీసి, టేస్టీ అండ్ యమ్మీ గులాబ్ జామూన్ ను కూల్ కూల్ గా సర్వ్ చేయాలి. ఈ డ్రైగులాబ్ జామూన్ ను గణేష చతుర్థికి రెడీ చేసుకోవ్చచ్చు.

English summary

Easy Homemade Dry Gulab Jamun Recipe For Ganesh Chaturthi

Chaturthi'. This is the first festival that falls in the bhadrapada masa. Ganesh Chaturthi too is celebrated with lots of enthusiasm all across our nation.
Story first published: Saturday, September 3, 2016, 11:25 [IST]
Desktop Bottom Promotion