For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గసగసాల హల్వా: టేస్టీ ఇండియన్ డిజర్ట్

|

గసగసాలు మనం అనేక వంటకాల్లో ఉపయోగిస్తున్నాము. సాసవలు(ఆవాల)కంటే చాలా చిన్నగా, తెల్లగా ఉండే గసగసాలు ఒట్టిగా తిన్నా భలే రుచి కలిగి ఉంటాయి . గసగసాల గురించి మనలో చాలా మందికి ఇంతవరకూ తెలుసు. కానీ ప్రాచీన కాలంలో మహార్షులు గసగసాలు ఔషధంగా భావించారు....

అందుకే ఆయుర్వేద వైద్యంలో గసగసాలను ఎక్కువగా ఉపయోగించి ఎన్నో ఔషధాలను తయారుచేస్తున్నారు. రోజూకొన్ని గసగసాలు తింటే మంచిదని చెబుతుంటారు. ఇవి రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి, వీటితో ఒక స్వీట్ హల్వా తయారు చేస్తే టేస్ట్ కు టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. గసగసాలతో స్వీట్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం...

Khus Khus Halwa: Indian Desserts

కావల్సిన పదార్థాలు :
గసగసాల : 100grms
చక్కెర: 1/2cup
పాలు: 2cups
నెయ్యి : 1/2cup
ఏలకులు : 4-5(పొడి చేసుకోవాలి)
బాదం: 5-6(గార్నిష్ చేయడానికి)

1. ముందుగా గసగసాలను శుభ్రంగా కడిగి, సన్నగా ఉన్న మట్టి, దుమ్మును తొలగించాలి. (చాలా చిన్నగా ఉండటం వల్ల కాఫీ ఫిల్టర్ లేదా కాఫీ స్ట్రెయినర్ లో వేసి శుభ్రం చేయాలి)
2. తర్వాత నీరు పూర్తిగా కారిపోయే వరకూ అలాగే ఉంచాలి.
3. తర్వత స్టౌ మీద మంద పాటి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో గసగసాలు వేసి, తక్కువ మంట మీద అవి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ అలాగే ఉండనివ్వాలి.
4. ఇప్పుడు అందులో పాలు పోసి మరిగించాలి. అలాగే యాలకలపొడి వేసి మీడియం మంట మీద మొత్తం పాలు గట్టిగా ఇమిరిపోయే వరకూ మీడియం మంట మీద ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి .
5. పాలు బాగా మరుగుతున్నప్పుడే, అందులో షుగర్ కూడా జోడించి బాగా మిక్స్ చేయాలి. పాలు చిక్కబడి, గసగసాలతో కలిసిపోయి మొత్తగా ఉడికి హల్వ లా తయారైనప్పుడు బాదంతో గార్నిష్ చేయాలి.

English summary

Khus Khus Halwa: Indian Desserts

Khaskhas ka halwa in Telugu. khaskhas ka halwa is very tasty and healthy for newly mothers. It is a unique and a delicious sweet dish. Here is the recipe of Khaskhas ka halwa.
Story first published: Tuesday, April 14, 2015, 15:59 [IST]
Desktop Bottom Promotion