For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్: బాదం మిల్క్ పూరి స్వీట్ రెసిపీ

By Staff
|

ఇండియాలో జరుపుకును ముఖ్యమైన పండుగల్లో నవరాత్రి ఒకటి. ఈ సంవత్సరం నవరాత్రి హంగామా అక్టోబర్ ఒకటవ తేది నుండే మొదలవబోతోంది. నవరాత్రులను 10 రోజుల వరకూ సలబ్రేట్ చేసుకుంటారు. ఈ పది రోజుల్లో ఇల్లలో ఇష్టమైన వంటకాలలో ఘుమఘమలాడే వంటలతో సెలబ్రేట్ చేసుకుంటారు .

ఈ నవరాత్రి ఓపెనింగ్ సెర్మనీగా స్పెషల్ స్వీట్ తయారీతో మీముందుకు వస్తోంది తెలుగు బోల్డ్ స్కై.కామ్. స్పెషల్ బాదాం మిల్క్ స్వీట్ రిసిపి,చాలా రుచికరమైనది, చూడగానే నోరూరిస్తుంటుంది. అంతే కాదు , ఈ స్వీట్ రిసిపి మీ ఇంటిల్లిపాది ముఖంలో చిరునవ్వును చిగురింపచేస్తుంది. ముఖ్యంగా ఈ స్వీట్ రిసిపిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతారు. ఇంకెందుకు ఆలస్యం స్వీట్ బాదం మిల్క్ పూరీ రిసిపి ఎలా తయారుచేయాలో తెలుసుకోవడమే ఆలస్యం....

కావలసినవి:

  • బాదంపప్పులు - 10
  • పాలు - 1 లీటరు
  • చక్కెర - 1 కప్పు
  • కుంకుమపువ్వు - కొద్దిగా
  • ఏలకులు - 4, 5
  • బాదం ఎసెన్స్ - 2 డ్రాప్స్
  • గోధుమ పిండి - 1 కప్పు
  • నెయ్యి - 1 టేబుల్ స్పూన్
  • ఆయిల్

తయారుచేయు విధానం:

1. బాదంపప్పులను నీటిలో వేసి ఒక గంట సేపు నానబెట్టాలి, తర్వాత పైపొట్టు తొలగించి, మిక్సీలో వేసి మెత్గా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా పాలు చేర్చి పేస్ట్ చేయాలి.

Navratri Special: Badam Milk Puri Sweet Recipe

2.తర్వాత గిన్నెలో పాలు పోసి మీడియం మంట మీద మరిగించాలి.

Navratri Special: Badam Milk Puri Sweet Recipe

3. పాలు కాగే సమయంలో, పూరిలకోసం పిండి కలిపి సిద్దంగా ఉంచుకోవాలి.

Navratri Special: Badam Milk Puri Sweet Recipe

4. ఒక బౌల్లో గోధుమ పిండి, పంచదార, నెయ్యి, కొద్దిగా వాటర్ వేసి పిండిని పూరిలకు కలిపినట్లు సాప్ట్ గా కలిపి పెట్టుకోవాలి. 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

Navratri Special: Badam Milk Puri Sweet Recipe

5. పాలు బాగా మరిగి సగం అయ్యేట్లు అనిపిస్తున్నప్పుడు, అందులో కుంకుమపువ్వు, యాలకలపొడి , ఫ్రెష్ బాదం, బాదం ఎసెన్స్ డ్రాప్స్, పంచదార వేసి మిక్స్ చేసి, పాలు మరింత చిక్కగా అయ్యే వరకూ ఉడికంచాలి.

Navratri Special: Badam Milk Puri Sweet Recipe

6. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి తక్కువ మంట మీద ఉంచాలి. నూనె కాగే లోపే పూరీల పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకుని చిన్న ఉండలు చేసి పూరిల్లా వత్తుకుని, కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

Navratri Special: Badam Milk Puri Sweet Recipe

7. బాగా కాలిన పూరిలను ఒక డీప్ ప్లేట్ లో పెట్టుకోవాలి.

Navratri Special: Badam Milk Puri Sweet Recipe

8. అంతలోపు పాలు చిక్కగా కాగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లగా లేదా వేడిగా పూరీల మీద పోయాలి.

Navratri Special: Badam Milk Puri Sweet Recipe

9. అంతే రుచికరమైన టేస్టీ అండ్ స్వీట్ బాదం మిల్క్ పూరీస్ రెడీ . దీన్ని నవరాత్రుల్లో ఎక్కువగా తయారుచేసుకుంటారు.

English summary

Navratri Special: Badam Milk Puri Sweet Recipe

Navratri is one of the most important festivals that is celebrated in India. And this year, Navratri begins from October 1st that falls on a Saturday. The festival is celebrated for 10 days. On all these ten days, special recipes are prepared.
Desktop Bottom Promotion