For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాల పాయసం: దీపావళి స్పెషల్ స్వీట్

|

పాల పాసయం కేరళలో చాలా పాపులర్ అయినటువంటి డిజర్ట్. చిక్కగా, క్రీమీగా మరియు లైట్ పింక్ కలర్లో ఉండే పాల పాయసంను రైస్ ఖీర్ అని కూడా పిలుస్తారు. చిక్కటి పాలతో బియ్యంను ఉడికించడం వల్ల చాలా సాఫ్ట్ గా ఉంటుంది.

ఈ పాలపాయసంను తయారుచేయడం చాలా సులభం మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. ఈ పాల పాయసంను చిక్కటి పాలతో తయారుచేస్తారు. ముఖ్యంగా ముఖ్యమైనటువంటి శుభకార్యాలకు దీన్ని ఎక్కువగా తయారుచేసుకుంటారు. పాయసం లేకుండా ఏ శుభకార్యం సంపూర్ణం కాదు. మరి ఈ దీపావళి రోజున మీ టేస్ట్ బడ్స్ మరింత స్వీట్ గా కమ్మగా రుచికరంగా ఉండాలంటే, పాల పాయసంను తయారుచేసి, సర్వ్ చేయండి.

Paal Payasam: A Must Try Recipe This Diwali

కావల్సిన పదార్థాలు:
చిక్కటి పాలు: 2ltrs
పంచదార: 21/2cup
బాస్మతి రైస్: 2-3tbsp
యాలకల పొడి: 1/2tbsp
జీడిపప్పు: 10(నెయ్యిలో వేగించి పెట్టుకోవాలి)
కండెన్స్డ్ మిల్క్: 2tbsp(అవసరం అయితేనే)

తయారుచేయు విధానం:
1. ముందుగా బాస్మతి రైస్ ను నీటిలో అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2. తర్వాత మందపాటి పాన్ లో పాలు పోసి, బాగా మరిగించాలి.
3. తర్వాత పాలలో ముందుగా నానబెట్టుకొన్న బియ్యం బాస్మతి రైస్ వేసి బాగా ఉడికించుకవాలి.
4. మీరు ప్రెజర్ కుక్కర్ ఉపయోగిస్తున్నట్లైతే కుక్కర్ లో బియ్యం ఉడికించుకొన్న తర్వాత అందులో పాలు మిక్స్ చేసుకోవచ్చు.
5. బియ్యంను కుక్కర్ లో ఉడికించుకొని, తర్వాత క్రిందికి దింపుకొని, గరిటెతో బాగా మెత్తగా చేసుకోవాలి.అంతలోపు పాలను బాగా మరిగించుకొని, అన్నంలో వేసి మిక్స్ చేసుకోవాలి.
6. ఇప్పుడు మీకు అవసరం అనిపిస్తే, కండెన్డ్స్ మిల్క్ ను కూడా పోసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
7. తర్వాత అందులోనే పంచదార మరియు యాలకలపొడి వేసి బాగా మిక్స్ చేస్తూ, ఉడకనివ్వాలి.
8. పంచదార కరిగి పాయసం చిక్కబడుతున్నప్పుడు నెయ్యిలో వేయించుకొన్న జీడిపప్పును గార్నిష్ చేయాలి. అంతే రుచికరమైన డిజర్ట్ రెడీ.

English summary

Paal Payasam: A Must Try Recipe This Diwali

Paal payasam is a popular dessert in Kerala. Thick, creamy, and light pink, paal payasam is a rich kheer made with full creamy milk in which rice is cooked till it becomes soft.
Story first published: Tuesday, October 21, 2014, 12:40 [IST]
Desktop Bottom Promotion