For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రవ్వ పూర్ణాలు: గణేష్ చతుర్థి స్పెషల్

|

రేపు గణేష చుతర్థి. దేశంలోనే అంగరంగవైభవంగా జరుపుకొనే ఈ గణేష చతుర్థికి వివిధ రకాల పిండివంటలు లడ్డూలు తయారుచేసి బొజ్జగణపయ్యకు సమర్పిస్తారు. ముఖ్యంగా గణేష చతుర్ధికి అటుకులు, కొబ్బరి పలుకులు, పటిక బెల్లం, నానుబియ్యం, చెరకు రసం.. చెరకు రసం, ఉండ్రాళ్ళు, కుడుములు...ఇవ్వన్నీ బొజ్జగణపయ్యకు విందు భోజనం!

దండు సహాయ అరుదెంచమని..విందారగించమని..ఆనందింపజేయమని సభక్తికంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ మంగళ హారితి పట్టే వేళ స్వామికి..ఈ వంటలను నైవేద్యంగా సమర్పించవచ్చు.. మరి వినాయక చవితి వంటలో రవ్వ బూరెలు ఎలా తయారుచేయాలో చూద్దాం...

Rava Purnalu : Ganesh Chaturthi Special


కావల్సిన పదార్థాలు:
రవ్వ: 2 cups
యాలకలపొడి: 1tsp
కార్న్ ఫ్లోర్: 1/4cup
పంచదార: 3cups
నెయ్యి: 1/2 cup
మైదా: 1 1/2 cup
బియ్యం పిండి: 1/4 cup

READ MORE:పూర్ణం కుడుములు: వినాయకుడికి స్పెషల్ నైవేద్యం

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి కరిగిన తర్వా త అందులో రవ్వ వేసి వేగించుకోవాలి.
2. తర్వాత వేరే గిన్నెలో నీళ్ళు పోసి, స్టౌ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో రవ్వ వేసి ఉడికించుకోవాలి.
3. రవ్వ 3 వంతులుఉడికిన తర్వాత అందులో పంచదార, యాలకలపొడి వేసి సన్నటి మంట మీద మగ్గనివ్వాలి.
4. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కొద్దిగా నీళ్ళు పోసి చిక్కగా కలుపుకోవాలి.
5. తర్వాత ముందుగా ఉడికించుకొన్న రవ్వ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత కొద్దిగా కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న లడ్డులుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె మరియు నెయ్యి వేసి కాగిన తర్వాత ఉండలుగా చుట్టుకొన్న రవ్వలడ్డూలను మైదా పిండి మిశ్రమంలో ముంచి కాగేనూనెలో వేసి అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. అంతే వేగిన తర్వాత వీటిని ప్లేట్ లోనికి తీసుకొని బొజ్జగణపయ్యకు నైవేద్యం సమర్పించాలి.

English summary

Rava Purnalu : Ganesh Chaturthi Special

Rava Purnalu : Ganesh Chaturthi Special. Rava Burelu: Tasty and Healthy.Boorelu is a tasty sweet dish for Any Festival. It is prepared with Bengal gram, jaggery or sugar and coconut. To enjoy the festive season with sweet dishes, check out boorelu recipe.
Story first published: Wednesday, September 16, 2015, 13:12 [IST]
Desktop Bottom Promotion