For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తీపి కుడుముులు:బొజ్జగణపయ్యకు ఇష్టమైనవి

|

విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు ఒకటే. వినాయక చవితికి చాలా స్పెషల్ డిషెష్ ను వండుతుంటారు. దక్షిణ భారత దేశంలో ప్రజలు అప్పుడే వినాయకచవితి పిండివంటలు మొదలెట్టేసుంటారు. వినాయకచవితి సౌత్ స్టేట్స్ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మరియు మహారాష్ట్రలలో చాలా పెద్ద పండుగ. ఈ పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.

గణపతి చాలా ఫవర్ ఫుల్ గాడ్! అందుకే ఉండ్రాళ్ళుతో పాటు తీపి కుడుములు కూడా చాలా ఇష్టం. గణపతి విఘ్నాలను తొలగిస్తాడు. ఉండ్రాళ్ళు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. బొజ్జగణపయ్య చాలా ఇష్టంగా ఆరగించే ఉండ్రాళ్ళను, తీపి కుడుములను భక్తితో వండి నైవేద్యం సమర్పిస్తే ఆయన సంతృప్తి చెందుతాడు. మనల్ని చల్లగా కాపాడుతాడు. కాబట్టి మన బొజ్జగణపయ్యకు వినాయక చవితి నాడు తీపికుడుములతో పూజించి మరి వరాలు కురిపించమని కోరుకుందాం...మరి తీపికుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం..

Sweet Kudumulu: Vinayakachaviti Special

కావలసిన పదార్థాలు:
గోధుమ రవ్వ: 1/2kg
బియ్యం పిండి: 1cup
పొట్టు పెసరపప్పు: 1/2kg
బెల్లం తురుము: 1/2kg
పచ్చిపాలు : 1/2ltr
కొబ్బరికాయ : ఒకటి
నెయ్యి: 100grm
యాలకుల పొడి: 1tbsp
మంచినీళ్లు: సరిపడా

తయారీ విధానం:
1. ముందుగా పెసరపప్పుని పొడి చేసి ఉంచాలి, తర్వాత కొబ్బరి తురమాలి.
2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమరవ్వ, పెసరపప్పు పొడి, బియ్యం పిండి, బెల్లం తురుము, పాలు, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకులపొడి వేసి బాగా కలపాలి. 3. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని గట్టి ముద్దలాగా చేయాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను అరచేతిలో పెట్టి నాలుగువేళ్లతో కోలగా ఒత్తాలి.
4. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో 20 నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించి తీయాలి. అంతే అందరూ ఇష్టంగా తినే తీపి కుడుములు రెఢీ!

Story first published: Wednesday, August 20, 2014, 13:06 [IST]
Desktop Bottom Promotion