For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ కర్డ్ రైస్ రిసిపి : టేస్టీ అండ్ హెల్తీ

|

ఇండియన్ వంటకాల్లో పెరుగన్నం చాలా స్పెషల్ సైడ్ డిష్. సౌత్ సైడ్ వెళ్ళినట్లైతే ప్రతి భోజనానికి పెరుగన్నాన్ని చూడవచ్చు . ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు కడుపును చల్లగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతుంది . అంతే కాదు కడుపు నిండేలా చేస్తుంది.

పెరుగన్నాన్ని తయారు చేయడానికి చాలా పద్దతులున్నాయి, అందులో చాలా సింపుల్ గా మరియు అతి సాధారణంగా ఎక్కువగా తయారు చేసే కర్డ్ రైస్ అన్నం, పెరుగు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చితో తయారు చేస్తారు. అయితే ఇందులో మీకు ఇష్టమైన పండ్లు కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. మరి మీకు ఇష్టమైన దానిమ్మ గింజలను ఉపయోగించి పెరుగు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం.

15 Minutes Spicy Curd Rice Recipe

కావల్సిన పదార్థాలు:
పెరుగు- 200 ml
అన్నం - 1 cup (ఉడికించినది)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఎండు మిర్చి - 2
ఆవాలు - 1 tsp
ఉల్లిపాయ - 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
పసుపు - 1 tsp
జీలకర్ర - 1 tsp
కరివేపాకు- 4 -5
ఉప్పు- రుచికి సరిపడా
నీళ్ళు - ½ cup
పండ్లు(అవసరం అయితే) - 1 tbsp(దానిమ్మవిత్తనాలు, ద్రాక్ష)
కొత్తిమీర- కొద్దిగా (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నూనె - 2 tbsp

READ MORE: పెరుగులో దాగి ఉన్న గొప్ప ఆరోగ్య రహస్యాలు

తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడి అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర మరియు ఎండుమిర్చి వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
2. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో పసుపు, మరియు కొద్దిగా నీళ్ళు పోయాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు మంట పూర్తిగా తగ్గించి అందులో పెరుగు వేయాలి.
4. పెరుగు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
5. తర్వాత ముందుగా వండి పెట్టుకొన్న అన్నం, దానిమ్మ విత్తనాలు, ద్రాక్ష, జీడిపప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి.

English summary

15 Minutes Spicy Curd Rice Recipe

15 Minutes Spicy Curd Recipe in Telugu. The summers are torrid in India and the only way to help cool ourselves is with the right type of food. Drinking a lot of water too helps in cooling the body and waving off the temperature.
Story first published: Saturday, June 6, 2015, 15:08 [IST]
Desktop Bottom Promotion