For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెరీ టేస్టీ అండ్ వెరైటీ తమిళనాడు అడై దోసె

|

బ్రేక్ ఫాస్ట్ రిసిపిలలో దోసె చాలా పాపులరైనటువంటి సౌంత్ ఇండియన్ స్పెషల్ రిసిపి. అడై దోసె తమిళనాడు లో చాలా ఫేమస్ మరియు కడుపు నిండుగా ఉంచే బ్రేక్ ఫాస్ట్ రిసిపిగా అక్కడా బాగా ప్రాచుర్యం పొంధింది. అడై దోసెకు వెజిటేబుల్ సాంబార్ మరియు కొబ్బరి చట్ని చక్కటి కాంబినేషన్.

అడై దోసె నార్మల్ దోసె కంటే కొంచెం మందంగా ఉంటుంది. ఈ దోసెకు ఉపయోగించే పిండి చాలా కారంగా కూడా ఉంటుంది. మరియు ఈ దోసెకు కొద్దిగా ఆయిల్ ఎక్కువే అవసరం అవుతుంది. కాబట్టి ఈ దోసెను టేస్ట్ చేయాలనుకునే వారు తప్పకుండా ఒక సారి ప్రయత్నించి తమిళనాడు రుచిని ఆశ్వాదించండి.

Adai Dosa: Spicy Breakfast Recipe

రవ్వ రైస్ : 1/2cup
ఇడ్లీ రైస్: 1/2cup
శెనగపప్పు: 1/2cup
కందిపప్పు: 1/3cup
కొబ్బరి తురుము: 1/3cup
ఎండు మిర్చి: 3-4
కరివేపాకు: 8-10
జీలకర్ర: 1tsp
ఇంగువ: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు : 2tbsp
కరివేపాకు: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాత్రలో బియ్యం వేసి శుభ్రం చేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత మరో పాత్రలో ఉద్దిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు కూడా వేసి నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు, నానబెట్టుకొన్న పప్పులన్నింటిని కలిపి, మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని ఒక గిన్నెలోని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత రాత్రంతా నానబెట్టుకొన్న బియ్యాన్ని, కొబ్బరి తురుము, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు కూడా మిక్సీలో వేసి, తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా దోసె పిండిలా గ్రైడ్ చేసుకోవాలి.
4. ఇప్పుడు రుబ్బిపెట్టుకొన్న బియ్యం పిండికి పప్పు పిండి మిశ్రమాన్ని మిక్స్ చేసి, ఉప్పు చేర్చిబాగా కలుపుకోవాలి. అలాగే అందులో కొత్తిమీర మరియు కరివేపాకు తరుగు వేసి బాగా మిక్స్ చేసి అరగంట నుండి గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత దోసె పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసి కాగిన తర్వాత దోసె పిండిని దోసెలా పోసుకోవాలి. రెండు నిముషాల తర్వాత దోసె మీద కూడా నూనె వేసి రెండు వైపులా దోరగా మీడియం మంట మీద కాల్చుకోవాలి. అంతే తమిళనాడు స్పెషల్ అడై దోసె రెడీ. ఈ బ్రేక్ ఫాస్ట్ ను సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

English summary

Adai Dosa: Spicy Breakfast Recipe | తమిళనాడు స్పెషల్ --అడై దోసె


 Dosa is a very staple breakfast dish in the southern parts of India. Adai originated in Tamil Nadu and adai dosa is a very popular and filling breakfast dish. Adai dosa is paired with vegetables, sambar and coconut chutney.
Story first published: Monday, June 3, 2013, 11:40 [IST]
Desktop Bottom Promotion