For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ పన్నీర్ కోప్తా కర్రీ: బెస్ట్ కాంబినేషన్ ఫర్ రైస్

|

ఆలూ పన్నీర్ కోప్తా కర్రీ చాలా రుచికరంగా ఉండేటటువంటి వెజిటేరియన్ రిసిపి. వెరైటీ ఫుడ్ తినాలని కోరిక ఉన్నవారు, కాస్త ఓపిక, శ్రద్ద పెట్టి చేసుకుంటే, ఇంతకంటే మంచి రుచికరమైన గ్రేవీకర్రీని తినలేరు అనుకోవచ్చు.

ఆలూ పన్నీర్ కోఫ్తాకర్రీ చాలా రుచికరమైనది మాత్రమే కాదు, ఇది ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఇందులో పన్నీర్, ఆలూ, డ్రైఫ్రూట్స్ ను పూర్తి పోషకాలున్న పదార్థాలను ఉపయోగించడం వల్ల ఆలూ పన్నీర్ కోప్తాకర్రీ ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఈ కోప్తా కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Aloo Paneer Kofta Curry

కావల్సిన పదార్థాలు:
పనీర్ : 200grms(తురుముకోవాలి)
బంగాళ దుంపలు: 3 (మీడియం సైజ్ -ఉడికించినవి)
బాదం పొడి: 1 ½ tbsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: ½tsp
ఛాట్ మసాలా: 1tsp
గరం మసాలా పొడి: ½tsp
కొత్తిమీర (సన్నగా తరిగిపెట్టుకోవాలి): 2tbsp
కార్న్ ఫ్లోర్: 2tbsp
మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ : 4tbsp(సన్నగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
కర్రీకోసం కావల్సినవి:
జీలకర్ర: 1tbsp
బిర్యానీ ఆకు: 1
అల్లం పేస్ట్: 1tsp
టమోటో గుజ్జు: 1tbsp
బాదం పొడి: 2tbsp
జీలకర్ర పొడి: 1tbsp
ఛాట్ మసాలా: 1tsp
కారం: 1/2tsp
పసుపు: ½ tsp
గరం మసాలా పొడి: ½tsp
సోంపు పొడి: ¼ tsp
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఆయిల్: 2tbsp

తయారుచేయు విధానం:
ముందుగా కోఫ్తాలు తయారుచేయు విధానం:
1. డ్రై ఫ్రూట్స్ మరియు నూనె తప్ప మిగిలిని పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత ఉడికించుకొన్న పంగాళదుంపలను బాగా చిదిమి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలుకట్టకుండా ఉంటుంది.
3. తర్వాత మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసి పెట్టుకన్న పదార్థాల్లో చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం సైజ్బాల్స్ గా తయారుచేసి, అరచేతిలో పెట్టుకొని వడలా చిన్న సైజులో తట్టుకోవాలి.
4. తర్వత మద్యలో డ్రై ఫ్రూట్స్ ను ఒక టేబుల్ స్పూన్ వేయాలి.
5. ఇప్పుడు చివర్లు కవర్ చేస్తూ డ్రైఫ్రూట్స్ ను కనపడకుండా అన్ని వైపుల నుండి మడిచి పెట్టుకోవాలి. (ఫుల్ గా కవర్ చేయాలి)ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్ బయటకు రాకుండా ఉంటాయి.
6. ఇలా అన్నికోఫ్తాలను తయారుచేసుకోవాలి.
7. తర్వాత డీఫ్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె పోసి, వేడయ్యాక ఆ నూనెలో కోఫ్తాలను జాగ్రత్తగా నిదానంగా వదిలో అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి..
8. ఇలా అన్ని కోప్తానలు తయారుచేసి పెట్టుకొన్న తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

కర్రీ తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఛాట్ మసాల, బ్లాక్ పెప్పర్ పౌడర్, సోంపు పొడి, గరం మసాలా వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో టమోటో గుజ్జువేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులో బాదం పొడి, ఉప్పు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
5. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా ఉడికిన తర్వాత ఈ గ్రేవీలో కోప్తాలను వేయాలి. నిదానంగా కలిబెట్టి మొత్తంమిశ్రమాన్ని ఉడకనివ్వాలి.
6. గ్రేవీ ఉడికిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే ఆలూ పన్నీర్ కోప్తాకర్రీ రెడీ . ఇది రైస్, అదే విధంగా రోటిలకు చాలామంచి కాంబినేషన్.

English summary

Aloo Paneer Kofta Curry

Aloo paneer kofta curry is a delicious vegetarian recipe which is a must try. The soft and mushy koftas are stuffed with dry fruits and then cooked in a spicy gravy. The taste of the dish is difficult to describe in words.
Story first published: Thursday, June 12, 2014, 12:21 [IST]
Desktop Bottom Promotion