For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ : ప్యాజ్ పరోటా : బ్రేక్ ఫ్టాస్ రిసిపి

|

పరోటా చాలా ఇష్టమైన, ఎక్కువగా ఎంపిక చేసుకొనే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్. శాఖాహారలు మరియు మాంసాహారలు ఎవరైనా సరే పరోటానో పొట్ట నింపే బ్రేక్ ఫాస్ట్ గా దీన్ని తీసుకోవచ్చు. ఇది టేస్టీగా పొట్ట నింపడంతో పాటు, ఆరోగ్యం కూడా. పరోటాను గోధుమపిండితో తయారుచేస్తారు. ఇది తేలికగా జీర్ణం అవ్వడమే కాదు, ఆరోగ్యకరమైనది కూడా.

మీరు ప్రయత్నించాల్సిన పరోటాల్లో వివిధ రకాలున్నాయి. చాలా సింపుల పరోటాల నుండి హెవీ పరోటాల వరకూ విభిన్న రకాలున్నాయి. స్టఫింగ్ పరోటాలు వివిధ రకాలుగా వండుతారు . స్టఫ్ పరోటాల్లో ఆలూ పరోటా చాలా ముఖ్యమైనది. ఈ రిసిపి చాలా సింపుల్ గా తయారుచేసేయవచ్చు. ఆలూ పరోటాకు చాలా మంది ఉల్లిపాయలు చేర్చరు. కాబట్టి, మరికొంత టేస్ట్ డిఫరెంట్ గా ఉండేందుక ఉల్లిపాయలు చేర్చి ఆలూ పరోటో తయారు చేస్తే ఎంత టేస్ట్ గా ఉంటుందో ఈ రిపిని ప్రయత్నించి చూడండి..

Aloo Pyaz Paratha: Breakfast Recipe

కావల్సిన పదార్థాలు:
ఆలు: 3-4
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చి మిర్చి: 2-3 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1 ½tsp
జీలకర్ర: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: ½cup

పరాటా కోసం
గోధుమ పిండి: 1 ½cup
నీళ్ళు: 2 cups
నూనె: 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను ఒక్కోదాన్ని నాలుగు భాగాలుగా కట్ చేయాలి. వీటిని ప్రెజర్ కుక్కర్ లో వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. అంతలోపు, పరాటో కోసం సిద్దం చూసుకొన్న పదార్థాలను ఒక గిన్నెలో వేసి సాఫ్ట్ గా చపాతి పిండిలా కలుపుకోవాలి.
3. బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఆవిరి మొత్తం తొలగిపోయిన తర్వాత, మూత తీసి, బంగాళదుంప యొక్క పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో 2టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి .
5. జీలకర్ర చిటపటలాడాక, అందులో కట్ చేసుకొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే పసుపు,ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు అందులో ఉడికించి, పొట్టుతీసి, చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపలను కూడా3 అందులో వేసి, మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. తర్వాత క్రిందికి దింపుకొని, చల్లారనివ్వాలి.
7. తర్వాత స్టౌ మీద తవా పెట్టి, మీడియం మంట పెట్టుకోవాలి, ఇప్పుడు ముందుగా కలిపి పెట్ట్టుకొన్న చపాతీ పిండి కొద్దికొద్దిగా తీసుకొని ఉండలు చేసి, చపాతీలో రోల్ చేయాలి. ఇప్పుడు మద్యలో ఆలూ మిశ్రమాన్ని పెట్టి, అన్నివైపులా ఫోల్డ్ చేసి, తిరిగా చపాతీలా ఒత్తుకోవాలి.
8. ఇలా రోల్ చేసిపెట్టుకొన్న ఆలూ పరోటాను, వేడి పాన్ మీద వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. పరోటా కాల్చడానికి నెయ్యి లేదా, నూనెను ఉపయోగించుకోవచ్చు . ఇలా మొత్తం పిండితో పరోటాలు తయారుచేసుకోవాలి. అంతే ఆలూ ప్యాజ్ పరోటా రెడీ . వీటిని పెరుగు లేదా మ్యాంగో పికెల్ తో సర్వ్ చేయాలి.

English summary

Aloo Pyaz Paratha: Breakfast Recipe

Paratha is one of the most preferred breakfast dish in most of the Indian households. Both vegetarian and non-vegetarians have parathas as it is a filling breakfast dish which is healthy too. Parathas are prepared with whole grains which are not only easy to digest, but healthy too.
Story first published: Friday, November 8, 2013, 11:03 [IST]
Desktop Bottom Promotion