For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెరీ టేస్టీ అండ్ హెల్తీ ఆంధ్రా కిచిడి

|

ఆంధ్రాకిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మందికి ఇష్టం. అంతే కాదు సులభంగా తయారు చేసుకోగల వంటకం.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొంటే శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి. ఎందుకంటే దీనిలో ఉపయోగించి పెసరపప్పు, నెయ్యి, మిరియాలు, జీలకర్ర వంటివి మంచి పోషకాంశాలతో పాటు, జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. మరి ఈ స్పెషల్ టేస్టీ ఆంధ్రా కిచిడిని ఎలా తయారు చేయాలో చూద్దాం...

Andhra Khichdi -Very Tasty and Healthy

బాస్మతి రైస్:11/ 2cups
పెసరపప్పు: 1/ 2cup
నెయ్యి: 1tbsp
జీలకర్ర: 1tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
మిరియాలు: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 31/2cup
జీడిపప్పు: 12(నెయ్యిలో గోధుమరంగు వచ్చేంత వరకూ వేగించుకోవాలి.

తయారు చేయు విధనాం:
1. ముందుగా బియ్యం, పెసరపప్పుని కడిగి, 15నిముషాలు నీళ్ళలో నానబెట్టాలి.
2. తర్వాత మందపాటి గిన్నెలో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, మిరియాలు వేసి వేయించుకోవాలి.
3. తర్వాత ముందుగా నానబెట్టుకొన్న బియ్యం పప్పులో నీళ్ళు వంపి, పోపులో వేసి కలియబెట్టాలి.
4. ప్రెజర్ కుక్కర్ లో అయితే రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. పాత్రలో అయితే అన్నం అయ్యే వరకూ ఉంచి దింపేయాలి.
5. నేతిలో వేయించి పెట్టుకొన్న జీడిపప్పుతో గార్నిష్ చేసి టమోటో చట్నీ కాంబినేషన్ తో వేడి వేడిగా వడ్డించాలి. అంతే ఆంధ్రా కిచిడి రెడీ.

English summary

Andhra Khichdi -Very Tasty and Healthy | ఆంధ్రా కిచిడి వెరీ టేస్టీ అండ్ హెల్తీ


 Here is the recipe of simple andhra khichdi. It is quite healthy and nutritious. It tastes really well if you eat it along with some andhra pickle or with curd or tomato chuttny. Very simple to prepare and is often made when one is sick or feeling tired.
Story first published: Monday, May 13, 2013, 11:36 [IST]
Desktop Bottom Promotion