For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోహా దోసె - టమోటో చట్నీ

|

సాధారణంగా దోసెలు వివిధ రకాలుగా వండుతారు. అయితే అటుకులతో దోసె చేయడం చాలా అరుదు. అటుకులు ఉప్మా, పులిహోర వంటి ఉపాహార్ని తయారు చేసినట్లే అటుకుల దోసెను కూడా తయారు చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. అంతే కాదు ఈ దోసెకు మరో పేరు కూడా ఉంది. ఈ దోసె చాలా మెత్తగా, స్పాంజ్ టైపులో ఉండటం వల్ల దీన్ని స్పాంజ్ దోస అని కూడా పిలుస్తారు. దీని రుచి కూడా అద్భుతంగా ఉండటం వల్ల ఒక సారి తిన్న వారు మళ్ళీ మళ్ళీ తినాలని కోరుకుంటారు. దీన్ని తాయారు చేయడం కూడా చాలా సులభం కాబట్టి మీరు కూడా ఒక సారి ప్రయత్నించి అటుకుల దోసె రుచి చూడండి.

Attukula Attu(Poha Dosa) with Tomata Chutny

కావాల్సిన పదార్థాలు:
బియ్యం: 2cups
అటుకులు: 1/2cup
చిక్కని,పుల్లటి పెరుగు: 3.5cups
మెంతులు: 1tsp
వంటసోడా : చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : తగినంత

టమోటో చట్నీకి కావల్సిన పదార్థాలు:

పెద్ద టమోటాలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర: 1 tsp
పచ్చిమిర్చి: 2-3(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారు చేయు విధానం:

1. ముందుగా అటుకులను ,బియ్యాన్ని,మెంచేసుకోవాలి.తులను,చిక్కటి పుల్లగా వున్న పెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి.మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

2.)తరువాత ఈ పిండిలో ఉప్పు,వంటసోడా కలిపి ఒక రెండు గంటలు పక్కన వుంచాలి.

3. తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి ఆ పైన ముందుగా రడీ గా వుంచుకున్న పిండి ని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి.దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాలాక తీసేయ్యాలి.అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ... ఈ దోశ కొబ్బరి చట్నీ,వేరుసెనగ పప్పుచట్నీ తో కూడా బావుంటాయి.

4. పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అలాగే టమోటో కూడా వేసి మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి, దానికి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడాకి ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి, తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకొన్న పేస్ట్ వేసి బాగా కలిపి వేడి వేడి అటుకుల దోసెతో సర్వ్ చేయాలి. అంతే అటుకుల దోసె టమోటో చట్నీ రెడీ...

English summary

Attukula Attu(Poha Dosa) with Tomata Chutny | పోహా(అటుకుల)దోస


 Among the myriad varieties of dosas, a special mention must be made of Attukula dosa which also goes by the name of ‘Sponge Dosa’ because of its soft and spongy character.
Story first published: Tuesday, January 22, 2013, 12:03 [IST]
Desktop Bottom Promotion