For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవియల్ కేరళ స్పెషల్-మనకు కొత్త రుచి

|

సాంబార్ లేదా కర్రీ లేదా గ్రేవీ లేదా పప్పు..ఓ వేపుడు...కూరగాయలు వేరైనా...ప్రతి రోజూ ఇవే తరహా వంటకాలంటే..కుటుంబసభ్యులందరూ అవే వంటకాలతో బోరుకొడుతుందని వాటి మీద అయిష్టత వ్యక్తం చేస్తారు.

కాబట్టి, అదే కూరగాయలతో పక్క రాష్ట్రాల వంటకాలను తయారు చేసుకుంటే కొత్త రుచితో ఇష్టంగా తినవచ్చు. కేరలలో ప్రత్యేకంగా, చాలా సులభంగా..త్వరగా తయారు చేసుకొనే వంట అవియల్. ఇందులో వివిధ రకాల కూరగాయలనుపయోగించి వంటను తయారు చేస్తారు. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...

Avial

కావల్సిన పదార్థాలు:
క్యారెట్: 3
బీన్స్: 8
అరటికాయ: 1
పచ్చిబఠాణి: 1/2cup
తీపి గుమ్మడికాయ: చిన్న ముక్క
చౌచౌ: రెండు
క్యాబేజ్ తురుము: 1/2cup
బంగాళదుంపలు: 2
చామదుంపలు: 4
మసాలా కోసం:
పచ్చికొబ్బరి ముక్కలు: 1cup
పచ్చిమిరపకాయలు: 6
పుట్నాలపప్పు: 1/2cup
ధనియాలు: 3tsp
జీలకర్ర: 11/2cup
తాజా పెరుగు: 1cup
కొబ్బరి నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా కూరగాయలన్నింటిని పెద్దపెద్దగా తరిగిపెట్టుకోవాలి.
2. తర్వాత బంగాళదుంప, చేమదుంప తప్ప మిగిలిన కూరముక్కలన్నింటినీ ఉప్పునీటిలో ఉడికించుకోవాలి.
3. ఆ తర్వాత బంగాళదుంప, చేమదుంపల్లని ఉడికించాలి.
4. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, శెనగపప్పు, ధనియాలు, చెంచా జీలకర్ర తీసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. పెరుగులో ఈ మిశ్రమాన్ని వేయాలి.
5. ఇందులో ముందుగా ఉడికించి నీరు వంపేసిన కూరగాయముక్కలన్నింటినీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత సన్నని మంట మీద ఉంచి, ఓ పదినిముషాలు ఉంచాలి.
6. దింపే ముందు కొబ్బరినూనెతో వేసిన జీలకర్ర తాలింపు, ఆతర్వాత కొత్తిమీర తరుగు, కరివేపాకుతో గార్నిష్ చేస్తే కమ్మని అవియల్ సిద్ధం.
7. ఇది చపాతీ, పూరీలనే కాదు..కప్పులో వేసుకుని తిన్నా కూడా ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

English summary

Avial - Onam Special

Avial is a typical kerala dish (koottu curry) with almost all vegetables. It is a must for OnaAadya. Avial is a very tasty dish and all the people, especially South Indians like this dish.
Story first published: Friday, September 13, 2013, 16:52 [IST]
Desktop Bottom Promotion