For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ కార్న్ ఫ్రై : స్పెషల్ సైడ్ డిష్

|

తల్లి కార్న్‌తో... అంటే దేశవాళీ మొక్కజొన్నలతో గారెలు, బూరెలు వగైరా చేసుకుని తింటాం. మరి పిల్ల కార్న్‌తో! దాంతో కూడా కూరలు, అన్నాలు లాంటివెన్నో చేసుకోవచ్చు. బేబీకార్న్‌ను మీగడతో కలిపితే కమ్మగా, పనీర్, పాలక్‌లతో చేరిస్తే పసందుగా కూరలు సిద్ధమైపోతాయి. శెనగలతో కలిపి రైస్ చేశారంటే బిర్యానీ రైస్ బలాదూరే. పులావ్ వండిపెడితే పళ్లెం ఖాళీ చేసేస్తారు. ఇవే కాకుండా టీ టైం స్నాక్‌లుగా కూడా మారి కరకరలాడతాయి. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు పేరులోనే పిల్ల కాని రుచిలో మాత్రం పెద్దదే ఇది.

మార్కెట్లో బేబీ కార్న్‌ కనిపించగానే ఆసక్తిగా వాటి దగ్గరికెళ్తాం. కానీ వాటిని ఎలా వండాలో తెలియక చివరికి కొనకుండానే ఇంటికొచ్చేస్తూ ఉంటాం. ఇకముందు అలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. బేబీకార్న్‌తో నోరూరించే ఈ రెసిపీలను ట్రై చేసి ఇంటిల్లిపాదినీ ఆశ్చర్యపరచండి..

Baby Corn Fry:Special Side Dish

కావాల్సిన పదార్ధాలు
బేబికార్న్: 7
టమాట: 1
క్యాప్సికమ్: 1
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
ఉల్లిపాయ: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 1/2tsp
నిమ్మరసం: కొద్దిగా
జీలకర్ర: 1tsp
ధనియాలపొడి: 1tsp
శనగపిండి: 1tsp
బియ్యంపిండి: 1tsp
మైదాపిండి: 1tsp
తగినంత నూనె: 1tsp
పసుపు: 1/4tsp

తయారు చేయు విధానం
1. ముందుగా బేబికార్న్ నాలుగు భాగాలు నిలువుగా కట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు ఒక బౌల్ లో మైదా, శనగపిండి, బియ్యంపిండి, పసుపు, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఉప్పు, కారం, సరిపడా నీళ్ళు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి.
3. తర్వాత ఈ మిశ్రంలో బేబికార్న్ వేసి కలిపి నూనెలో వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని పెట్టుకోవాలి.
4. ఫ్రై చేసిన బేబీకార్న్ ముక్కలమీద జీలకర్రపొడి, ధనియాలపొడి, నిమ్మరసం, ఉల్లిముక్కలు, వేసి క్యాప్సికమ్, టమాట, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి.

English summary

Baby Corn Fry:Special Side Dish

This is very very simple sabji / dry curry which can be taken with meals. It is healthy and corn lovers might enjoy... they will now be baby corn lovers too after making .. and eating this :-)
Story first published: Friday, February 20, 2015, 14:24 [IST]
Desktop Bottom Promotion