For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీన్స్ పొరియల్ - కమ్మని శాఖాహార వంటకం..

|

సౌత్ ఇండియన్ వంటలు చాలా సింపుల్ గా మరియు టేస్టీగా ఉంటాయి. టేస్టీగా వంటలు వండటానికి గంటల తరబడీ వంటగదిలో వేచి ఉండనవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచికరమైన కమ్మని శాఖాహార వంటలను తయారు చేయవచ్చు. శాఖాహార వంటలు వివిధ రకాలు ఉన్నాయి. అందులో ఒకటి బీన్స్ పొరియల్ అతి తక్కువ సమయంలో రుచికరంగా తయారు చేయవచ్చు.

బీన్స్ పొరియల్ ను సాధారణంగా తాజాగా లేతగా ఉన్న బీన్స్ తో తయారుచేస్తారు. రుచికరంగా కమ్మగా ఉండటం కోసం ఫ్రెష్ కొబ్బరి తురుము మరియు పప్పులు కూడా యాడ్ చేస్తారు. ఈ వంటకం యొక్క ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీన్స్ పొరియల్ మధ్యహ్నా భోజనం లేదా డిన్నర్ కు బాగా సూట్ అవుతుంది. అన్నం సాంబార్ కు మంచి కాంబినేష్ ఈ బీన్స్ పొరియల్ మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

Beans Poriyal: Delicious Vegetarian Recipe

ఫ్రెంచ్ బీన్స్ : 250gms
ఉల్లిపాయ : 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిరపకాయలు : 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
తాజా కొబ్బరి : ½cup(తురుము కోవాలి)
ఉద్దిపప్పు : 1tsp
ఆవాలు : 1tsp
జీలకర్ర : 1tsp
పసుపు : 1tsp
ఎండుమిరపకాయలు : 1(విరిగిన)
కరివేపాకు : 2రెబ్బలు
హింగ్ (ఇంగువ) : ఒక చిటికెడు
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 1tbsp
నీళ్ళు: 1 ½cup

తయారు చేయు విధానం:
1. ముందుగా బీన్స్ ను శుభ్రంగా కడిగి చివరలు కట్ చేసి మీకు కావల్సిన సైజులో చిన్నగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో అరకప్పు నీళ్ళు పోసి బీన్స్ ను తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
3. బీన్స్ మెత్తగా ఉడికిన తర్వాత నీరువంపేసి బీన్స్ ను ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఆవాలు, ఇంగువ, జీలకర్ర, మరియు ఎండు మిర్చి వేసి తక్కువ మంట మీద ఒక నిముషం పాటు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే ఉద్దిపప్పు, కరివేపాకు మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 3-4నిముషాలు వేగించుకోవాలి.
6. తర్వాత అందులో పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు మరియు ఉడికించి పెట్టుకొన్న ఫ్రెంచ్ బీన్స్ వేసి మరో రెండు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము వేసి బాగా మిక్స్ చేస్తూ మరో ఐదు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. అంతే అన్ని బాగా కలుగోపుగా కలిసిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే బీన్స్ పొరియల్ ను, అన్నం సాంబార్ తో సైడ్ డిష్ గా సర్వ్ చేయాలి.

English summary

Beans Poriyal: Delicious Vegetarian Recipe | బీన్స్ పొరియల్ -కమ్మని సైడ్ డిష్

The beauty of South-Indian cooking is its simplicity. There is no need to spend long hours in the kitchen and yet you can be rest assured that the meal would be sumptuous. South-Indian cuisine is a blessing for vegetarians. It has so many varieties of delicious vegetarian recipes to choose from.
Story first published: Tuesday, June 4, 2013, 12:36 [IST]
Desktop Bottom Promotion