For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీట్‌రూట్ వండుదాం.ఆరోగ్యాన్ని పొందుదాం...

|

బీట్ రూట్ ఇది ఒక దుంప కూరగాయ. బీట్ రూట్ తో వివిధ రాకాల వంటలు వండుతారు. ముఖ్యంగా బీట్ రూట్ తో చేసే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బీట్ రూట్ కర్రీ, వేపుడు వంటివి మంచి టేస్ట్ ఉంటుంది. ఇది రంగు రుచి మాత్రమే కాదు ఆరోగ్యపరంగాను బాగా సహాయపడుతుంది. బీట్ రూట్ లో అత్యధిక పోషవిలువలు ఉన్నాయి.

ఎవరైనా రక్తహీనతతో బాధపడుతుంటే బీట్ రూట్ తినమని సలహా ఇచ్చేస్తుంటారు. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధవున్నవారు రెండుబీట్ రూట్ తినడానికి ఇష్టపడుతారు. అయితే బీట్ రూట్ తినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. నిజానికి బీట్ రూట్ ను, జ్యూసులు, సలాడ్, వేపుడు రూపంలోనే కాకుండా బోలెడు వెరైటీలుగా వండుకుని తినొచ్చు. పూరీలు మొదలు వడలు వరకూ వివిధ రకాల వంటలు తయారు చేసుకొని తినవచ్చు. మరి బీట్ రూట్ తో వెరైటీగా పాఠోళీ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Beetroot Patoli

కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్ ముక్కలు: 1cup
పచ్చిమిర్చి: 4-6
శనగపప్పు: 1/2cup
ఉల్లిపాయ తరుగు: 1/2cup
అల్లం: చిన్నముక్క

పోపు కోసం:
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
శనగపప్పు: 1tsp
మినప్పప్పు: 1tsp
ఎండుమిర్చి: 2
కరివేపాకు: 2 రెమ్మలు
ఉప్పు, పసుపు: తగినంత
నూనె: సరిపడా
తయారి:
శనగపప్పును రెండు గంటలు నానబెట్టి వడకట్టాలి. శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం కలిపి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని, ఒక పళ్లెం మీద పరచి కుకర్లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి చల్లార్చాలి. తరవాత దీనిని మెత్తగా చిదుముకోవాలి. బీట్‌రూట్‌ని కూడా కుకర్‌లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఒక బాణలిలో నూనె వేడి చేసి, పోపు సామాను వేసి చిటపటలాడాక, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయతరుగు, పసుపు వేసి వేయించాలి. చివరగా ఉడికించిన బీట్‌రూట్, శనగపప్పు మిశ్రమం, ఉప్పు వేసి రెండు నిముషాలు వేయించి దించేయాలి.

English summary

Beetroot Patoli: Yummy and healthy | బీట్‌రూట్ వండుదాం.ఆరోగ్యాన్ని పొందుదాం...

Patoli is a dry South Indian curry made of dal or combination of dals / lentils. A plain patoli is prepared by first soaking the dal and grinding it with some spices.
Story first published: Monday, May 6, 2013, 12:08 [IST]
Desktop Bottom Promotion