For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్తహీనతకు మంచి ఆహారం బీట్ రూట్ పులావ్

|

Beetroot Pulao
బీట్ రూట్ ఇది ఒక దుంప కూరగాయ. బీట్ రూట్ తో వివిధ రాకాల వంటలు వండుతారు. ముఖ్యంగా బీట్ రూట్ తో చేసే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బీట్ రూట్ కర్రీ, వేపుడు వంటివి మంచి టేస్ట్ ఉంటుంది. ఇది రంగు రుచి మాత్రమే కాదు ఆరోగ్యపరంగాను బాగా సహాయపడుతుంది. బీట్ రూట్ లో అత్యధిక పోషవిలువలు ఉన్నాయి.

ఎవరైనా రక్తహీనతతో బాధపడుతుంటే బీట్ రూట్ తినమని సలహా ఇచ్చేస్తుంటారు. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధవున్నవారు రెండుబీట్ రూట్ తినడానికి ఇష్టపడుతారు. అయితే బీట్ రూట్ తినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. నిజానికి బీట్ రూట్ ను, జ్యూసులు, సలాడ్, వేపుడు రూపంలోనే కాకుండా బోలెడు వెరైటీలుగా వండుకుని తినొచ్చు. పూరీలు మొదలు వడలు వరకూ వివిధ రకాల వంటలు తయారు చేసుకొని తినవచ్చు. మరి బీట్ రూట్ వెరైటీగా పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలిసిన పదార్థాలు:

బీట్‌ రూట్‌: 2
బాస్మతి బియ్యం: 2cups
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి: 5
ఎండు మిర్చి: 4
కరివేపాకు: రెండు రెబ్బలు
లవంగాలు: 6
దాల్చిన చెక్కలు(చిన్నవి): 4
గరం మసాలా: 1tsp
ఉల్లిపాయ: 1
పుదీన: 1cup
కొత్తిమీర: 1cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పొయ్యిమీద దళసరి గిన్నె పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా కాగాక లవంగాలు, దాల్చిన చెక్క, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పుదీన ఆకులు వేసి వేగించాలి.
3. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, బీట్‌ రూట్ ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి.
4. ఆ తర్వాత బియ్యం, గరం మసాలా పొడి, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి మరో ఐదు నిమిషాలపాటు వేగించాలి. తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించి దించేయాలి.

English summary

Beetroot Pulao-Healthy and Tasty | బీట్ రూట్ పులావ్-హెల్తీ అండ్ టేస్టీ

Beetroot Pulao - Yummy and healthy!!! - this is a very healthy recipe. Try it you'll love it. So here is a really healthy, delicious and really colourful meal that can be put together in no time – Beetroot Pulao. It is perfect for your kids as well as your lunch box.
Story first published:Saturday, February 16, 2013, 13:11 [IST]
Desktop Bottom Promotion