For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగాలీ మిష్టి పులావ్ -స్పెషల్ స్వీట్ అంట్ ఫ్లేవర్డ్ డిష్...

|

బెంగాలీ మిష్గీ పులావ్ ఒక రైస్ డిష్. మీకు శక్తినించేటటువంటి ఒక ఆరోగ్యకరమైన ఆహారం. బెంగాల్లో ‘మిష్టి'అంటే స్వాట్ అని అర్ధం. బెంగాలీ మిష్టి పులావ్ లైట్ గా స్వీట్ గా, సువాసన కలిగిన ఫ్లేవర్డ్ రైస్. పెళ్ళిళ్ళు మరియు పండగలకు సాధారణంగా తయారు చేసుకుంటారు. ఈ వంట యొక్క స్పెషాలీటి ఏంటంటే ఎటువంటి గ్రేవీతో అయినా తినేయవచ్చు.

బెంగాలీ మిష్టి పులావ్ ను బాస్మతి బియ్యాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఎందుకంటే బాస్మతి రైస్ సువాసన అద్భుతంగా ఉంటుంది కాబట్టి. సువాసన మాత్రమే కాదు, రుచి కూడా స్పెషల్ గా ఉంటుంది. మరి ఈ స్పెషల్ బెంగాలీ మిష్టి పులావ్ ను మీరు తయారు చేసుకోవాంటే ఈ క్రింది పద్దతిని ఫాలో అయిపోండి...

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
పసుపు: 2tsp
పంచదార: 3tbsp
లవంగాలు: 4
యాలకలు: 4
బిర్యాని ఆకు: 1
జీడిపప్పు: 2tbsp
ఎండు ద్రాక్ష: 2tbsp
నీళ్ళు : 4cup
నెయ్యి: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసి, కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి. దాని తర్వాత, నీరు వంపేసి, పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో లవంగాలు, యాలకలు, బిర్యాని ఆకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. అవి వేగిన తర్వాత అందులో బియ్యం, పసుపు, పంచదార, మరియు ఉప్పు వేయాలి.
4. వీటన్నింటిని బాగా మిక్స్ చేస్తు 3-4నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
5.తర్వాత అందులో నీళ్ళు, జీడిపప్పు పలుకులు మరియు ఎండు ద్రాక్షవేయాలి.
6. ఈ మిశ్రమాన్నంతటిని బాగా ఉడికించాలి, మంటను బాగా తగ్గించి మూత పెట్టి 15నిముషాలు బియ్యం పూర్తిగా ఉండికేంత వరకూ ఉడికించుకోవాలి.
7. బియ్యం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి. అంతే బెంగాలీ మిస్తీ పులావ్ రెడీ. ఈ పులావ్ ను అలాగే తినవచ్చు. లేదా చికెన్, మటన్ కర్రీ కాంబినేషన్ తో ట్రై చేయండి...

English summary

Bengali Mishti Pulao

Bengali mishti pulao is one rice dish which you just cannot resist eating. In Bengali 'mishti' means sweet. Bengali mishti pulao is a mildly sweet, aromatic and a flavoured rice recipe which is generally prepared in special occasions like festivals and marriages.
Desktop Bottom Promotion