For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోబీ మలై కర్రీ -స్పెషల్ టేస్ట్

|

గోబీ మలై కర్రీ డిఫరెంట్ టేస్ట్ కలిగినటువంటి కాలీఫ్లవర్, ఫ్రెష్ క్రీమ్ తో తయారుచేసేటటువంటి వంట. ఇది ఒక టేస్టీ వెజిటేరియన్ కర్రీ. ఇందులో కొన్ని ఇండియన్ మసాలా దినుషులతో తయారుచేసిన పేస్ట్ తో తయారుచేయడ వల్ల మంచి టేస్ట్ తో పాటు ఆరోమా వాసన కలిగి ఉంటుంది. అటువంటి అద్భుతమైన వంటను ఈ రోజు మీకోసం పరిచయం చేస్తున్నాం.

ఈ గోబీ (కాలీఫ్లవర్)కర్రీ కొబ్బరి పాలు, మసాలాలతో గ్రేవీగి తయారుచేసే ఈ వంట చాలా రుచిగా డిఫరెంట్ గా మలై టేస్ట్ ను కలిగి ఉంటుంది. మరి ఈ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం.

Bengali Style Gobi Malai Curry Recipe

కావల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్-1 (మధ్య సైజ్లో పువ్వులను వేరు చేసుకోవాలి)
ఉల్లిపాయ పేస్ట్: 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటో గుజ్జు 2tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: ½ tsp
గరం మసాలా పొడి: ½tsp
కొబ్బరి పాలు: 1 cup
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp(సన్నగా తరిగినది)

తయారుచేయు విధానం:
1. ముందుగా కాలీఫ్లవర్ పువ్వులను విడిపించుకొని ఉప్పు నీటిలో 10నిముషాలు నానబెట్టుకోవాలి.
2. తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. పాన్ లో ఒక చెంచా నూనె వేసి అందులో కాలీఫ్లవర్ వేసి మీడియం మంట మీద 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. వేయించుకొని, ఒక ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, జీలకర్ర వేసి మరో నిముషం వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయ పేస్ట్ ను కూడా వేసి 4,5నిముషాలు వేయించుకోవాలి.
5. తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరో 3,4నిముషాలు వేయించుకోవాలి.
6. తర్వాత అందులో టమోటో పేస్ట్ వేసి మరో రెండు, మూడు నిముషాలు వేయించుకోవాలి. తర్వాత అదులోనే ఫ్రై చేసుకొన్న కాలీఫ్లవర్, ఉప్పు, మరియు కొబ్బరి పాలు వేసి బాగా మిక్స్ చేయాలి.
7, మూత పెట్టి 5నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి. తర్వాత మూత తీసి, గరం మసాలాను చిలకరించి మరో రెండు నిముషాలు ఉడికించుకొని స్టౌ ఆఫ్ చేయాలి.
8. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే గోబీ మలై కర్రీ రెడీ. ఈ క్రీమీ డిలైట్ కర్రీని రోటీలు లేదా అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు.

English summary

Bengali Style Gobi Malai Curry Recipe

Bengali recipes have a charm of their own. Be it fish or chicken or a simple vegetarian curry, the unique mix of spices lend the dish a distinct aroma and taste. Today we have a simple yet a sumptuous recipe of cauliflower straight from the Bong mom's kitchen.
Story first published: Wednesday, March 5, 2014, 12:19 [IST]
Desktop Bottom Promotion