For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ

|

గ్రీన్ వెజిటేబుల్స్ పుష్కలంగా దొరికే సీజన్ వింటర్. మార్కెట్లో, చిన్న చిన్నకూరగాయల అంగడిలో మొత్తం గ్రీన్ గ్రీన్ గా వెజిటేబుల్స్ కనబడుతుంటాయి. కాబట్టి, సీజనల్ గా దొరికే వివిధ రకాల కూరగాయాలను మర రెగ్యులర్ డైట్ లో పూర్తిగా చేర్చుకోవాలి. అప్పుడే మన శరీరానికి చేరాల్సి పోషకాశాలన్నీ అందుతాయి. ఒక్కో రకమైన కూరగాలతో వంట వండటం ఒక రుచి అయితే, మూడు, నాలుగు రకాల తాజా కూరగాయలు, వాటికి కొద్దిగా కూరాకు కూడా మిక్స్ చేస్తే చాలా అద్భుతమై రుచి ఉంటుంది.

మన ఇండియన్ స్టైల్ వంటే అయినే, సౌంత్ మరియు నార్త్ రిసిపిలు చాలా వెరైటీగా వేటికవే రుచిని కలిగి ఉంటాయి. సౌత్ వారికి నార్త్ వంటలు నచ్చితే, నార్త్ వారి సౌత్ వంటలు నచ్చుతాయి. మరి నార్త్ సైడ్ వంటల్లో ఒక అద్భుతమైన రుచికలిగిన సాధారణ వంట మిక్డ్స్ వెజిటేబుల్ కర్రీ. ఇది చాలా పాపులర్ రిసిపి. దీన్ని తయారుచేయడం చాలా సులభం, మరియు చాలా తేలిక. మరి ఈ డెలిషియస్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Bengali Style Mixed Vegetable Curry

కావల్సిన పదార్థాలు:
బంగాళ దుంపలు : 2 (పొట్టు తొతలగించి మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి)
ఆకుకూర: కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
క్యారెట్: 1 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వంకాయ: 1 (మీడియం సైజ్, కట్ చేసుకోవాలి )
మునక్కాడలు: 2 (మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
పచ్చి బటానీలు: ½cup
అల్లం: 1 మీడియం సైజ్ (తురుముకోవాలి)
కళా జీర (ఉల్లిపాయ విత్తనాలు) : 2tbsp(పొడి చేసుకోవాలి)
ఉల్లిపాయ విత్తనాలు: 1tsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
నీళ్ళు: ½cup

తయారుచేయు విధానం:
1. ముందుగా కట్ చేసి పెట్టుకొన్న కూరగాయ ముక్కలన్నింటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంప ముక్కలను ఉప్పునీటిలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి .
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో ఒక చెంచా ఉల్లిపాయ విత్తనాలు వేయాలి.
3. ఈ విత్తనాలు వేగడం మొదలుపెట్టాక అందులో అల్లం తురుము వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత కూరగాయ ముక్కలను ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ 4-5నిముషాలు మీడియం మంట మీద వేగించుకవోాలి.
5. ఇప్పుడు అందులో కట్ చేసిన ఆకుకూర తరుగు, పసుపు పౌడర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
6. మీడియం మంట పెట్టి 5-10నిముషాలు ఉడికించుకోవాలి.
7. తర్వాత అవసరం అయినంత మేర నీళ్ళు పోసి, మూతపెట్టి 10నిముషాలు ఉడికించుకోవాలి.
8. వెజిటేబుల్ ముక్కలు మెత్తగా ఉడికినవలో లేదో నిర్ధారించుకొని, పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ . ఈ అద్భుతమైన వంటను రోటీ లేదా పరాటాలో సర్వ్ చేయండి.

English summary

Bengali Style Mixed Vegetable Curry


 Winter is the time for greens. You see green vegetables all around. Ah! What a bliss it is to sit by the balcony and enjoy a hot, veggie meal under the winter sun.
Story first published: Wednesday, November 20, 2013, 14:49 [IST]
Desktop Bottom Promotion